'పంట చేతికొచ్చింది' అంటున్న శర్వానంద్.. శ్రీకారం సిద్దమైంది!
సక్సెస్ ఫెయిల్యూర్స్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా విబిన్నంగా సినిమాలు చేసే యువ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటున్న శర్వానంద్ అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని మరి.. మంచి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో శ్రీకారం సినిమాతో హిట్టు కొట్టడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. మార్చ్ 11న మహా శివరాత్రి కానుకగా వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగిశాయి. క్లీన్ యూ సర్టిఫికెట్ రావడంతో 'పంట చేతికొచ్చింది' అంటూ శర్వానంద్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే శర్వానంద్ మరోసారి శతమానం భవతి లాంటి హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఈ హీరో ఆర్ఎక్స్100% దర్శకుడు అజయ్ భూపతితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.
మహాసముద్రం అనే ఆ సినిమాలో సిద్దార్థ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. సీరియస్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











