పవన్ కళ్యాణ్ ఉన్నా...లేక్క చేయని శర్వానంద్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమా బరిలో ఉందంటే ఇతర చిన్న హీరోల సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడరు నిర్మాతలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో ఉందంటే....ఇతర సినిమాల వైపు జనాలు చూడరనే భయం వారిలో ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి పరిస్థితి వేరుగా ఉండబోతోంది.
పవన్ కళ్యాణ్-వెంకటేష్ మల్టీ స్టారర్ గా నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. అదే సమయంలో శర్వానంద్ నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రం కూడా విడుదల కాబోతోంది. శర్వానంద్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ లి. బ్యానర్ పై కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో బరిలో ఉన్నా శర్వానంద్ లాంటి హీరో బరిలోకి దిగుతుండటం చర్చనీయాంశం అయింది.

‘గోపాల గోపాల' సినిమా విషయానికొస్తే...
పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో ఈ నెలలో విడుదల కానుంది. బహుషా డిసెంబర్ 28న ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
హిందీ చిత్రం ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడ తగ్గకుండా సినిమాను తీశామని నిర్మాతలు డి.సురేష్‌బాబు, శరత్‌మారార్‌లు తెలిపారు. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











