ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు శశి కపూర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్ ఆసుపత్రి పాలయ్యారు. చాతి ఇన్‌ఫెక్షన్ రావడంతో అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. 76 ఏళ్ల శశి కపూర్ తీవ్రమైన దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అతన్ని ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు.

శశి కపూర్ పరిస్థితి గురించి డాక్టర్లు మీడియాకు వెల్లడిస్తూ...‘చాతి ఇన్ ఫెక్షన్ కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఐసీయూలో ఉంచి శశి కపూర్ ఆరోగ్యపరిస్థితి పర్యవేక్షిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బాడీలకి యాంటీ బయోటిక్స్ పంపించి చికిత్స చేయిస్తున్నాము' అని డాక్టర్ రామ్ నారాయన్ తెలిపారు.
శశి కపూర్ దాదాపు 160 చిత్రాల్లో నటించారు. మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 2010లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రాలైన ‘దీవార్', ‘సిల్ సిలా', ‘సత్యం శివం సుందరం' లాంటి చిత్రాల్లో నటించారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య జెన్నిఫర్ కెండాల్ కొంతకాలం క్రితమే మరణించింది.


Click it and Unblock the Notifications