చెరుగని చిరునవ్వు మాయం.. శశి ఇకలేరని విషాదంలో మునిగిన ప్రముఖులు..

హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొన్నశశికపూర్ మరణవార్తతో భారతీయ సినీ, రాజకీయ, ఇతర రంగాలు విషాదంలో మునిగిపోయాయి. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు ఆయన అంద

By Rajababu

Recommended Video

Shashi Kapoor : Unknown facts about veteran actor and his personal life | Oneindia News

హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరోగా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొన్నశశికపూర్ మరణవార్తతో భారతీయ సినీ, రాజకీయ, ఇతర రంగాలు విషాదంలో మునిగిపోయాయి. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

Shashi Kapoor No more: celebrities tweets an Romantic Icon

రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఇతర రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శశికపూర్‌కు సోషల్ మీడియాలో ప్రముఖులు తెలిపిన సంతాపం వివరాలు..

అత్యున్నత నటుల్లో ఒకరు

భారత దేశపు అత్యున్నత నటుల్లో శశికపూర్ ఒకరు. ఆయన మరణ వార్త నన్ను కదిలించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన చిరస్మరణీయం. ఓం శాంతి అని ట్వీట్ నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

రొమాంటిక్ ఐకాన్

సిల్వర్ స్క్రీన్‌పై శశికపూర్ రొమాంటిక్ ఐకాన్. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు.

మహిళలకు ఆరాధ్యదైవం

శశికపూర్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవారు. ఆయన లొట్ట బుగ్గలు ఎందర్నో ఆకట్టుకొనేవి. ఆయనతో ప్రేమలో పడని భారతీయ మహిళలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన నటుడు. లవ్లీ పర్సన్ అని బర్ఖాదత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

విషాదంలో మునిగిపోయాను

యాక్టర్ శశికపూర్ ఇకలేరనే వార్తతో విషాదానికి గురయ్యాను. సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవి. అప్పటికి గుర్తుంచుకొంటారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని

వేడుకొంటున్నాను.

ఓ అధ్యాయం ముగిసింది

శశికపూర్ ఇకలేరు. భారతీయ సినీ పరిశ్రమలో ఓ అధ్యాయం ముగిసింది. అతడి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని ప్రముఖ సినీ విమర్శకుడు, ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఓ శకం ముగిసింది..

నా సహచర నటుడు శశికపూర్ మరణవార్త నాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కపూర్ల చివరి జనరేషన్ ఆధ్యాయం ముగిసినట్టే. నాకు మంచి స్నేహితుడు. జెంటిల్మన్. ఓ శకం ముగిసిపోయింది. అతడి మధురు స్మృతులే ఇక మిగిలాయి అని ప్రముఖ నటి సిమీ గరేవాల్ ట్వీట్ చేశారు.

డైలాగ్స్ కొట్టడంలో మేటి

డైలాగ్స్ చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. భవితరం నటులకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. తీవ్ర విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని

ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

లెజెండరీ యాక్టర్

లెజెండరీ యాక్టర్ శశికపూర్ మరణంతో విషాదంలో మునిగిపోయాను. అతని కుటుంబ సభ్యులకు నా తీవ్ర సంతాపం అని క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు.

మీరు లేని లోటు తీర్చలేనిది..

శశికపూర్ సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు లేని లోటు తీర్చలేనింది అని ప్రముఖ సినీ తార బిపాసా బసు ట్వీట్ చేశారు.

మోస్ట్ చార్మింగ్

ఇండియన్ సినిమాలో అద్భుతమైన వ్యక్తి. చార్మింగ్ యాక్టర్. అనారోగ్యంతో శశికపూర్ మరణించారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

శశికపూర్ సహచర నటుడు

ముంబైలో అడుగుపెట్టగానే శశికపూర్ లేరనే విషాద వార్తను విన్నాను. నా తొలి సినిమాలో సహచర నటుడు ఆయన. జెంటిల్మన్, ఆకర్షణీయమైన వ్యక్తి. క్లాస్, క్రమశిక్షణకు మారుపేరు. అందగాడు. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదు. నీ మధుర స్మృతులతో జీవితాన్ని గడుపుతాం అని అలనాటి తార పూనమ్ థిల్లాన్ ట్వీట్ చేశారు.

శశికపూర్ మేటి నటుడు

శశికపూర్ మరణవార్తతో విషాదంలో మునిగిపోయాను. వెండితెర మీద అద్భుతమైన డైలాగ్స్‌తో అదరగొట్టిన మేటి నటుడిని, ఆయన ప్రతిభను ఎలా మరువగలం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు.

విషాదంలో మునిగిపోయాను..

లెజెండరీ యాక్టర్ లేరనే దుర్వార్తతో విషాదంలో మునిగిపోయాను. శశికపూర్ అంటే నాకు ఎనలేని అభిమానం. ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X