twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శశికపూర్ జీవితం.. ఎదురు దెబ్బలు.. మధుర స్మృతులు.. రాజేశ్ ఖన్నాతో నువ్వా నేనా..

    By Rajababu
    |

    బాలీవుడ్‌లో ఎదురులేని సినిమా సామ్యాజ్యాన్ని స్థాపించిన కపూర్ల వంశంలో పుట్టినప్పటికీ.. శశికపూర్‌కు హీరోగా నిలదొక్కుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఓ దశలో ఫ్లాప్ హీరో‌గా ముద్ర పడ్డారు. హీరోయిన్ నందాతో కలిసి నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే చిత్రంతో బ్లాక్‌బస్టర్‌గా కావడంతో శశికపూర్ వెనుదిరిగి చూసుకోలేదు.

    జీనత్‌ ఆమన్‌తో బ్లాక్‌బస్టర్లు

    జీనత్‌ ఆమన్‌తో బ్లాక్‌బస్టర్లు

    జీనత్‌ ఆమన్‌‌తో కలిసి శశికపూర్‌ పది సినిమాల్లో నటిస్తే ఆరు చిత్రాలు ఘన విజయం సాధించాయి. హీరోయిన్ రాఖీతో కలిసి పది చిత్రాలు నటిస్తే ఏడు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

     రాజేశ్ ఖాన్నాతో నువ్వా నేనా?

    రాజేశ్ ఖాన్నాతో నువ్వా నేనా?

    80వ దశకంలో రొమాంటిక్ హీరో, సూపర్‌స్టార్ రాజేశ్‌ఖన్నా, శశికపూర్‌ మధ్య మంచి పోటీ ఉండేది. కానీ రాజేశ్ ఖన్నాను తలదన్నే నటుడు కాలేకపోయాడు. ఒకవేళ ఏదైనా చిత్రాన్ని రాజేశ్‌ ఖన్నా వదులుకుంటే నిర్మాత, దర్శకులు శశికపూర్‌ వద్దకు వెళ్లేవారు. అయితే తనదైన శైలిలో మెప్పించి ప్రేక్షకులను, విమర్శకులను ఒప్పించారు.

     ఫ్లాప్‌లతో సతమతం

    ఫ్లాప్‌లతో సతమతం

    70వ దశకం ఆరంభంలో శశికపూర్‌ నటించిన సినిమాల్లో దాదాపు పదికి పైగా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో ఆయన మల్టీస్టారర్‌ సినిమాల వైపు మళ్లారు. హీరోగా 61 సినిమాల్లో నటిస్తే 33 చిత్రాలు సక్సెస్ సాధించాయి. అదే మల్టీస్టారర్‌గా 54 సినిమాలు చేస్తే 34 సూపర్‌హిట్లుగా నిలిచాయి. శశికపూర్‌లో ‘అభినేత్రి'లో ఆయన పాత్రను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

     అమితాబ్‌కు సోదరుడిగా

    అమితాబ్‌కు సోదరుడిగా

    బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు సోదరుడి పాత్రలో శశికపూర్‌ ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. ‘దివార్‌', ‘సుహాగ్‌', ‘దో ఔర్‌ దో పాంచ్‌', ‘నమక్‌ హలాల్‌' లాంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాల్లో శశికపూర్‌ తనదైన నటన కనబరిచారు. 1981లో వచ్చిన ‘సిల్‌సిలా' చిత్రంలో మాత్రం శశికపూర్‌కు తమ్ముడిగా అమితాబ్‌ నటించడం విశేషం. ‘దీవార్‌' చిత్రంలో ‘తుమ్హారే పాస్‌ క్యా హై' అని అమితాబ్‌ వేసిన ప్రశ్నకు ‘మేరే పాస్‌ మా హై' అని శశికపూర్‌ చెప్పిన చిన్న డైలాగ్‌ దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది.

     శ్యాం బెనగల్‌తో

    శ్యాం బెనగల్‌తో

    నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్‌తో కలిసి కలియుగ్‌, జునూన్‌ చిత్రాలు, అపర్ణాసేన్‌తో కలిసి ‘36 చౌరంఘీలేన్‌' సినిమాలను నిర్మించారు. గిరీష్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సవ్‌' చిత్రంలో శశి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    ఆంగ్ల చిత్రాల్లో

    ఆంగ్ల చిత్రాల్లో

    కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్‌ పేరు గడించారు. మొత్తం 12 హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. 1998లో ఆయన నటించిన చివరి చిత్రం, హాలీవుడ్‌ చిత్రం ‘సైడ్‌ స్ట్రీట్స్‌'.

    English summary
    Actor Shashi Kapoor has died at the age of 79 in Mumbai. He had been admitted to Kokilaben Hospital.Shashi Kapoor was a member of the Kapoor family, a film dynasty in India’s Bollywood cinema. Kapoor was born in Kolkata during the British Raj. He is the 3rd and the youngest son of Prithviraj Kapoor, the younger brother of Raj Kapoor and Shammi Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X