twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఇంట్లో పెరిగాడు... హీరో అవుతాడనుకోలేదు: మెగా స్టార్ ఇలా చెప్పాడు

    శర్వానంద్‌ను చిన్నప్పటినుంచీ చూస్తున్నా. చరణ్‌కు మంచి స్నేహితుడు. మా ఇంట్లోనే తిరుగుతూ పెరిగాడు. చాలా సౌమ్యంగా కనిపించే శర్వా హీరో అవుతాడని అనుకోలేదు.

    |

    'ఖైదీనెంబర్‌ 150', 'గౌతమిపుత్రశాతకర్ణి' వంటి బడా సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'శతమానం భవతి'. హీరో శర్వానంద్‌ను వరుసగా రెండోసారి సంక్రాంతి హీరోగా నిలబెట్టిన ఈ సినిమా విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, వినాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన 'శతమానం భవతి' విజయోత్సవ వేడుక శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకకు సినీ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    Shatamanam Bhavati Success Meet Highlights

    కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రానికి దర్శకుడైన వి.వి.వినాయక్‌ను చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'దిల్‌రాజు నిజంగానే 'దిల్‌' ఉన్న నిర్మాత. మంచి కుటుంబ కథలతో చిత్రాలను నిర్మిస్తున్నాడు. పరిశ్రమలో నిర్మాత పాత్ర క్యాషియర్‌గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో దిల్‌రాజు సినిమాకు అన్నితానై మంచి చిత్రాలను నిర్మిస్తున్నాడు.

    శతమానంభవతి చిత్రాన్ని నిర్మించినందుకు దిల్‌రాజును అభినందిస్తున్నాను. తొలి సినిమా 'దిల్‌' చిత్ర నిర్మాణ సమయంలో కథ, కథనాలు అంటే ఏమిటో రాజుకు నేర్పించిన వినాయక్‌ను గుర్తుపెట్టుకుని మరీ ఈ వేదికపై సన్మానించడం చాలాబాగుంది. శర్వానంద్‌ను చిన్నప్పటినుంచీ చూస్తున్నా. చరణ్‌కు మంచి స్నేహితుడు. మా ఇంట్లోనే తిరుగుతూ పెరిగాడు. చాలా సౌమ్యంగా కనిపించే శర్వా హీరో అవుతాడని అనుకోలేదు.

    కానీ, శర్వాకు సినిమాలంటే చాలా ఆసక్తని చరణ్‌ చెప్పడంతో ఆశ్చర్యపోయా. మొదటిసారి ఓ వాణిజ్య ప్రకటనలో నాతో కలిసి నటించాడు. ఆ తర్వాత 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమాలో నటించాడు. అతను వరుసగా విజయాలు సాధిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక, దిల్‌ ఉన్న నిర్మాత దిల్‌ రాజు. ఇలాంటి మంచి సినిమా నిర్మించినందుకు అతణ్ని అభినందిస్తున్నా. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయే నటుడు ప్రకాశ్‌రాజ్‌. జయసుధ కూడా అద్భుతంగా నటించార'ని చిరంజీవి అన్నాడు. 'దిల్‌' సినిమాతో తనను నిర్మాతగా మార్చిన దర్శకుడు వినాయక్‌ను నిర్మాత దిల్‌ రాజు ఈ వేదికపై సన్మానించాడు.

    English summary
    Megastar Chiranjeevi Attended as special guest for Shatamanam Bhavati Success Meet and said about Sarvanand in His speech, "I know sarvanand frome His chailhood, I dint expect that Sarva became a Hero"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X