twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ బేబీల లిస్టులో చేరిన షాజన్ పదంసీ

    By Bojja Kumar
    |

    ఆరెంజ్ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ తార 'షాజన్ పదంసీ' ఆ సినిమా ప్లాపవడంతో ఏ ఒక్క తెలుగు సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకోలేక పోయింది. అనంతరం ఆమెకు బాలీవుడ్లో 'దిల్ తో వచ్చా హై జీ' అనే చిత్రంలో చాన్సు కొట్టేసింది. అ చిత్రం కూడా అంతంత మాత్రంగానే నడవటంతో మళ్లీ ఆమెకు నిరాశే ఎదురైంది. అయితే ఆమెకు అనుకోండా 'హౌస్ ఫుల్ 2' లాంటి పెద్ద చిత్రంలో చేసే అవకాశం లభించింది.

    పబ్లిసిటీ పెంచుకోవడానికి, మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి ఇదే మంచి అవకాశం అని భావించిన షాజన్...బికినీ వేసేందుకు సిద్ధమైంది. 2 పీస్ బికినీలో అందాల విందుకు చేయడానికి సై అంది. అందంగా కనిపించం కోసం చాలా వర్కౌట్లు చేసి సన్నబడింది కూడా. మరి షాజన్ పదంసీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

    కాగా షాజన్ 2010లో తమిళంలో నటించిన కనిమొళి చిత్రం తాజాగా తెలుగులో 'లవ్ జర్నీ' పేరుతో విడుదల కాబోతోంది. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జర్నీ ఫేం జై, షాజన్ పదంసీ, కలర్స్ స్వాతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత: మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం: శ్రీపతి.

    English summary
    Shazahn who was known for her bubbly role in "Orange" will now join the bikini brigade of Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X