చెర్రీని నమ్మి నష్టపోయింది! మరి నాగచైతన్యతోనైనా...
'ఆరెంజ్' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బేబీ షాజన్ పదంసీ తొలుత ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా సంబర పడింది. అప్పటికే రామ్ చరణ్ 'మగధీర' విజయంతో మంచి ఊపు మీద ఉండటంతో చరణ్‌పై చాలా నమ్మకం పెట్టుకుంది. అయితే 'ఆరెంజ్' సినిమా మెగా ప్లాపుగా నిలవడంతో తన అంచనా రివర్స్ అయింది. మళ్లీ ఒక్క ప్రొడ్యూసరు, దర్శకుడు ఆమెను తీసుకోవడానికి సాహసించలేదు.
మళ్లీ చాలా కాలం తర్వాత షాజన్ పదంసీకి తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో షాజన్ మాట్లాడుతూ...' తెలుగు ఓసినిమాకు సైన్ చేశాను. అందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ సినిమాపై చాలా నమ్మకం ఉంది' అని చెప్పింది.
ఆరెంజ్ సినిమా తర్వాత అవకాశాలు ఎందుకు రాలేదని మీడియా వారు అడగ్గా....అదేం లేదు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా, అందుకే తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా అంటూ కటింగులిస్తోంది. మరి చరణ్ ఆరెంజ్ ను నమ్ముకుని నష్టపోయిన ఈ భామకు నాగ చైతన్యతోనైనా కలిసి వస్తుందో లేదో చూడాలి.
కాగా...షాజన్ తమిళంలో నటించిన 'కనిమొళి' అనే సినిమా తెలుగులో 'లవ్ జర్నీ' పేరుతో విడుదల కాబోతుంది. జై, కలర్స్ స్వాతి, షాజన్‌పదంసి ప్రధానపాత్రధారులుగా రూపొందిన ఈచిత్రాన్ని శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈచిత్రం మార్చి 16నే విడుదల కావాల్సి ఉండగా, కోర్టు చిక్కుల కారణంగా విడుదల వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











