రామ్ చరణ్ హీరోయిన్...నాగచైతన్యతో ఖరారు
రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమె మరో తెలుగు చిత్రం చేయటానికి సైన్ చేసింది. నాగచైతన్య హీరోగా చేయనున్న చిత్రానికి ఆమె కమిటైంది. అగస్టు నుంచి ప్రారంభమయ్యే ఆ చిత్రం తిరిగి ఆమెకు తెలుగు పరిశ్రమకు దగ్గర చేసి మరిన్ని ఆఫర్స్ తెచ్చిపడతాయని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంగ్లీష్ డైలీతో స్వయంగా కన్ఫర్మ్ చేసి చెప్పింది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...నేను రీసెంట్ గా ఓ తెలుగు చిత్రం సైన్ చేసాను. ఆగస్టు నుంచి అది మొదలవుతుందని డేట్స్ తీసుకున్నారు. ఆ చిత్రంలో హీరో నాగచైతన్య. మిగతా వివరాలు త్వరలో మీకే తెలుస్తాయి అంది. అలాగే తాను హిందీలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో కాన్సర్టేట్ చెయ్యలేకపోయాను అని చెప్పింది. ఇక అడపాదడపా తమిళ చిత్రాలలోనూ చేస్తున్నానని,మంచి ఆఫర్స్ వస్తే తెలుగు చిత్రాలు చేయటానికి తనకు అభ్యంతరం ఏమీ లేదని అంది.
ఆలాగే రెండు వారాల క్రితం ఆమె నటించిన 'హౌస్‌ఫుల్-2 అనే కామెడీ చిత్రం విడుదలకు విడుదలైంది. బాలీవుడ్ లో భారీ స్టార్ కాస్టింగ్ తో తీసిన ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. కానీ వర్కవుట్ కాలేదు. మదూర్ బండార్కర్ 'దిల్ తో బచ్చా హై జీ' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల ఎంపికలో ఈ ముద్దుగుమ్మ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మరిన్ని బాలీవుడ్ అవకాశాలు ఆమె చుట్టూ తిరుగుతున్నా పెద్ద బ్యానర్,స్టార్ హీరోలతోనే చేయాలనే ఆమె వెయిట్ చేస్తోంది.
మరో ప్రక్క ఆమె తమిళంలో నటించిన ఓ చిత్రం డబ్బింగే ఇక్కడ రిలీజ్ కు రెడీ అవుతోంది. కలర్స్ స్వాతి, ఆరెంజ్ సినిమా హీరోయిన్ షాజన్ పదాంసీ నటించిన తమిళ చిత్రం 'కనిమొళి'. జర్నీ ఫేం జై ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెలుగులో అనువదం కాబోతోంది. జె.ఎన్.ఆర్. పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై జిక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రం తెలుగు హక్కులను దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











