చరణ్ హీరోయిన్ని అతితెలివి ప్రదర్శించి బోల్తా కొట్టించిన బాలీవుడ్ స్టార్...!
బాలీవుడ్ కండల కింగ్ సల్మాన్ ఖాన్, తాను నటించబోయే 'దబాంగ్2"సినిమా కోసం హీరోయిన్ల వేటలో బిజీగా ఉన్నాడు. 'వీర్" సినిమా ఫేమ్ జరీన్ ఖాన్ ని ఓ హీరోయిన్ గా ఫిక్సయిపోయిన సల్మాన్ ఖాన్, ఇంకో హీరోయిన్ గా తెలుగు 'ఆరెంజ్"ఫేం షాజాన్ పదామ్సీని ఎంపిక చేశాడట. 'ఆరెంజ్" సినిమా చూశాననీ, ఆ సినిమాలో నీ లుక్ అదిరిందనీ షాజాన్ పదామ్సీని పొగడ్తలతో ముంచెత్తేసి, ఆమెను బుట్టలో పడేశాడట సల్మాన్ ఖాన్. ఏం..బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాను కదా..వాటిల్లో నన్నెందుకు చూడలేదని షాజాన్ ఎదురు ప్రశ్నించేసరికి ఖంగుతిన్న సల్మాన్ ఏదోలా తన తెలివితేటలతో కవర్ చేసేశాడట. అన్నట్టు, తెలుగు సినిమాల మీద తెగ యావతో వున్న సల్మాన్ ఖాన్, ఏ తెలుగు సినిమా వచ్చినా, దాన్ని ఒకటికి పదిసార్లు చూసేస్తున్నాడు. ఆ కోవలోనే 'రెడీ" సినిమాని హిందీలోకి సల్మాన్ రీమేక్ చేసేసుకుంటున్నాడు లెండి. అఫ్ కోర్స్..అలాగే 'పోకిరి"ని హిందీలో 'వాంటెడ్" చేసేశాడు సల్మాన్ ఖాన్. అలా 'ఆరెంజ్" సినిమాతో షాజాన్ పదామ్సీని సల్మాన్ పట్టుకున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











