‘ఆరెంజ్’లో నా నటనకు మంచి మార్కులు పడ్డాయి
'ఆరెంజ్" చిత్రంలోని నా నటనకు అంతటా మంచి ప్రశంసలు అందాయి, చాలామంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు. కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి అంటూ చెప్తోంది షాజన్ పదంసీ. ఆరెంజ్ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇది విన్న వారంతా ఆ చిత్రం ప్లాప్ అయిందనే సంగతి ఆమెకు తెలియదా ఏమిటనే సందేహం వ్యక్తం చేసారు. అలాగే తాను తమిళంలో నటించిన 'కణి మొళి"లోని పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పింది. ఇక తెలుగులో తెలుగు, తమిళ భాషల్లో సోలో హీరోయిన్ గా పలు అవకాశాలు వస్తున్నాయని, అవన్నీ ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని వివరించింది. హిందీలో 'దిల్ తో బచ్చా హై జీ" అనే చిత్రంలో హుషారైన పాత్రలో నటించినట్లు ఆనందంతో చెప్పింది. షాజన్ పదమ్ సీకి 21 సంవత్సరాల వయసున్నప్పుడు షారూఖ్ ఖాన్ సరసన ఎయిర్ టెల్ యాడ్ లో నటించింది. అదే సంవత్సరం రణ్ బీర్ కపూర్ సరసన 'రాకెట్ సింగ్: సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో నటించటం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











