రామ్ చరణ్ తేజ హీరోయిన్ గా ఆమె కన్ఫర్మ్
రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా షజాన్ పదమ్సి(Shazahn Padamsee) ఎంపిక చేసారు. ఆమెపై కొన్ని సన్నివేశాలను ముంబైలో షూట్ చేసారు. వాటిని ఎక్సపోజ్ చేసి చూసి చిరంజీవి కుటుంబసభ్యులు సైతం సంతృప్తి చెందారని సమాచారం. ఈ సన్నివేశాలు సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ కొత్త హీరోయిన్ రీసెంట్ గా రాకెట్ సింగ్..ది సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ లో నటించింది. రామ్ చరణ్ తేజ ముంబయి స్నేహితులు కొందరు ఆమెను సజెస్టు చేసారని తెలుస్తోంది. దాంతో ఆమె ఆల్బమ్ తెప్పించుకుని చూసి భాస్కర్ కి రికమెండ్ చేసారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. జెనీలియా మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.
ఆరెంజ్ రామ్ చరణ్ తేజ్ జెనీలియా చిరంజీవి నాగబాబు బొమ్మరిల్లు భాస్కర్ orange ram charan teja genelia chiranjeevi nagababu bommarillu bhaskar


Click it and Unblock the Notifications