రామ్ చరణ్ హీరోయిన్ తో రామ్ ఆటా,పాట
హైదరాబాద్: రామ్‌చరణ్‌తో 'ఆరెంజ్'లో నటించిన బాలీవుడ్ భామ సాజన్ పదమ్‌సీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చెయ్యలేదు. గ్యాప్ తర్వాత రామ్ తో 'గరమ్ మసాలా' చిత్రం చేస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి నటిస్తోంది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది.
హిందీలో విజయవంతమైన బోల్ బచ్చన్ ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నారు వెంకటేష్, రామ్ హీరోలుగా విజయభాస్కర్ దర్శకత్వం లో చిత్రం రూపొందుతోంది. డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'గరమ్ మసాలా ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications












