రామ్ చరణ్ హీరోయిన్ కి ఫుడ్ పాయిజినింగ్
రామ్ చరణ్ తేజ్ తో 'ఆరెంజ్"చిత్రంలో చేసిన షాజన్ పదాంసీ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఫుడ్ పాయిజనింగ్ కి గురి అయ్యింది. హౌస్ ఫుల్ 2 చిత్రంలో బికినీలో కనిపించాలని గత రెండు నెలలుగా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతున్న ఈ ముద్దుగుమ్మ తన స్నేహితురాలు ఇంటికి డిన్నర్ కి వెళ్ళింది. అయితే చాలా కాలంగా ఆకలిగా ఉన్న ఈమె అక్కడ బాగానే లాగించేసింది. అయితే తెల్లారి ఆమె లేచేసరికి కళ్లు తిరుగుతున్నట్లు, చాలా అనీజిగా ఉన్నట్లు, వామ్టింగ్ సెన్షేషన్ ఉండటంతో వెంటనే డాక్టర్ దగ్గరకి పరుగెత్తింది. అక్కడ అన్ని టెస్ట్ లు చేసిన డాక్టర్స్ ఆమె ఫుడ్ పాయిజనింగ్ కు గురి అయినట్లు తేల్చారు. మందులిచ్చి ఓ రోజు పాటు పూర్తి రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
దాంతో ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఆ మధ్యన కూడా యువ క్రికెటర్ శ్రీశాంత్‌తో కలిసి తిరుగుతోందని మీడియా కంటిన్యూగా వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఏమీ లేదని... అంటూనే ఆ గాసిప్స్‌ను ఎంజాయ్ చేసింది. ఇక అంతకుముందు రామ్ చరణ్ గురించి చెపుతూ.. రామ్ చరణ్ కు పని పట్ల అంకిత భావం ఉందని ప్రశంసించింది. తనను ఎంతో మర్యాదగా చూసేవాడని, తెలుగు అర్థం చేసుకోవడానికి తనకు సహకరించేవాడని, రామ్ చరణ్ తో కలిసి పూర్తి స్థాయి పాత్రలో నటించాలని తనకు కోరికగా ఉందని ఆ అమ్మడు చెప్పింది.


Click it and Unblock the Notifications











