రామ్ చరణ్ 'ఆరెంజ్ ' లో నా పాత్ర...షాజన్ పదమ్ సీ
"రామ్ చరణ్ తేజ సరసన తెలుగులో 'ఆరెంజ్' చిత్రంలో నటిస్తున్నాను. టీనేజ్ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తాను. సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో నా పాత్ర వస్తుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ముందు దక్షిణాది చిత్రాల్లో పనిచేయాలనే తపనపడేదాన్ని. ఇక్కడి సినీ పరిశ్రమలో ప్రొఫెషనలిజం ఎక్కువ. దక్షిణాది చిత్రాల్లో నటించటం ద్వారా నటిగా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఆత్మవిశ్వాసంతో నటించే మనోనిబ్బరాన్ని ఇక్కడి వారు నాకు నేర్పించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించే అవకాశం రావటం నా అదృష్టం" అని షాజన్ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్, జెనీలియా జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న 'ఆరెంజ్' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా షాజన్ పదమ్ సీ నటిస్తోంది. షాజన్ పదమ్ సీకి 21 సంవత్సరాల వయసున్నప్పుడు షారూఖ్ ఖాన్ సరసన ఎయిర్ టెల్ యాడ్ లో నటించింది. అదే సంవత్సరం రణ్ బీర్ కపూర్ సరసన 'రాకెట్ సింగ్: సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో నటించటం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళంలో 'కనిమొళి', హిందీలో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ సరసన 'దిల్ తో బచ్చా హైఁ జీ' చిత్రాల్లో ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











