ఆమె నా మనసు దోచుకుంది: రామ్ చరణ్
మెగా తనయుడు రామ్ చరణ్, తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ఉపాసన కామినేనితో జీవితం పంచుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి కూడా వీళ్ల పెళ్లి విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. ఇదంతా పాత విషయమే. కొత్త విషయం ఏమిటంటే చరణ్ తొలిసారిగా ఉపాసన గురించి నోరు విప్పాడు. అవును ఆమె నా మనసు దోచిన, నన్ను గెలిచిన చెలి అంటూ సిగ్గు పడుతూ చిలక పలుకులు పలికాడు.
చిరంజీవి...చరణ్ పెళ్లి విషయం ఖరారు చేయక ముందు, వీళ్ల పెళ్లి మెగా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని, చరణ్ మాత్రం ఆమెనే చేసుకుంటానంటూ పట్టుబడుతున్నాడని, పెద్దలను ఒప్పించడానికి ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటున్నాడని వార్తొలొచ్చాయి.
చరణ్ ఈ వార్తలను ఖండించారు. మేము మా తల్లిదండ్రుల మనసు నొప్పించలేదని, వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. ఉపాసన తనకు, తన ఆలోచనకు తగిన పాట్నర్, ఆమెతో జీవితం పంచుకోబోతుండటం ఎంతో సంతోషంగా ఉందంటూ ఇంత కాలం తన మనసులో దాచుకున్న మాటలను బయట పెట్టాడు.
ఈ సంవత్సరాంతంలోగా చరణ్-ఉపాసనల ఎంగేట్ మెంట్ పూర్తి చేసి. 2012లో ఫెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. మెగా తనయుడు, పైగా చిరంజీవి ఇప్పుడు అధికార పార్టీ నేత కనుక....పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారు. చరణ్ తోటి హీరోలు జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహ వేడుకలను తలదన్నే రీతిలో భారీ హంగులు రామ్ చరణ్ పెళ్లిలో దర్శనం ఇవ్వనున్నాయి.


Click it and Unblock the Notifications











