షాక్.. కళ్యాణ్ రామ్ సినిమాలో ఆమె హీరోయిన్ కాదంట!
కళ్యాణ్ రామ్ నా నువ్వే మే 25వ తేదిన విడుదల కానుంది.. ఇక తన తదుపరి మూవీని సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. శాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈరోజు నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న కళ్యాణ్ రామ్ సెట్స్ లో పాల్గొనడం జరిగింది.

అర్జున్ రెడ్డి అమ్మాయితో
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస మూవీలు చేస్తున్నాడు. అతడు తాజాగా పూర్తి చేసిన మూవీ నా నువ్వే మే 25వ తేదిన విడుదల కానుంది.. ఇక తన తదుపరి మూవీని సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. శాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్
ఈరోజు నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న కళ్యాణ్ రామ్ సెట్స్ లో పాల్గొనడం జరిగింది. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలో చిత్ర టైటిల్ ను అనౌన్స్ చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

నివేదా హీరోయిన్ కాదంట
ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటించడం లేదని సమాచారం. హీరోయిన్ గా చేస్తున్నది శాలిని పాండే మాత్రమే.. మరి నివేదా థామస్ ఏంటి అనే సందేహాలు రావచ్చు. ఆ విషయనికి వస్తే.. నివేదా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోందని సమాచారం. హీరోకు ఆమెకు ఇటువంటి సంభంధం ఉండదని తెలుస్తోంది.

పవన్ సాదినేనితో సినిమా
సినిమాలో కళ్యాణ్ రామ్, నివేదా థామస్ కలుసుకోవడం జరగదని సమాచారం,కాని సినిమా మొత్తం నివేదా కోసమే జరుగుతుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా కొత్త రకమైన కథ, కథనాలతో వస్తోందని చెప్పవచ్చు. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్, డైరెక్టర్ పవన్ సాదినేని సినిమా మొదలు కాబోతోంది.


Click it and Unblock the Notifications











