twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతో క్లోజ్ గా వున్న తీరనికోరిక : షీలా

    By Staff
    |

    వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ వివి వినాయక్ దర్శకత్వం, వల్లభనేని వంశీమోహన్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా 'అదుర్స్" .షలా 'సీతాకోక చిలుక" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనది. ఆ చిత్రం మంచి గుర్తింపు ఇవ్వకపోయినా పరుగు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు తొలి సక్సెస్ లభించినది. తర్వాత మస్కా సినిమాలో గ్లామర్స్ పాత్రను పోషించి కుర్రకారు హదయాలకు గిలిగింతలు పెట్టారు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అదుర్స్". ఈ సినిమాలో డాన్సుల్లో జూ. ఎన్టీఆర్ ఇరగదీస్తున్నాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది హీరోయిన్ షీలా. డాన్సుల్లో అంత స్పీడ్ ని తానిప్పటి వరకూ చూడలేదని షీలా చెప్తున్నా, గతంలో పరుగు సినిమాలో అల్లు అర్జున్ పైనా, మస్కా సినిమాలో రామ్ పైనా షీలా ఇవే కాంప్లిమెంట్స్ విసరడం విశేషం. ఆ మాటకొస్తే సినిమా హీరోలతో ప్రెండ్లీ గా ఉండటం షీలాను మించిన వారెవ్వరూ ఉండరనే అభిప్రాయాలు ఫిలిం సర్కిల్లో బాగా వినిపిస్తున్నాయి. తనతో పనిచేసే హీరోలపై ఓవర్ గా కాంప్లిమెంట్ ఇచ్చేయడం ద్వారా షీలా ఎత్తుగడ బాగానే ఉన్నా సినిమా తారలకు అందం ప్రధానాస్త్రం మనిషిని చూడగానే నటనని అంచనా వేయలేరు అంటూ హితవులు పలుకుతున్నాఆమెకు ఆశించిన రేంజ్ లో అవకాశాలు మాత్రం దక్కకపోవడం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X