బాలకృష్ణ సరసన అంటే హ్యాపీనే... షీలా
ఈ సంవత్సరం ఎన్టీఆర్ తో నటించిన 'అదుర్స్' మంచి విజయం సాధించింది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన 'పరమ వీరచక్ర' సినిమాలో అవకాశం వచ్చింది. అందుకే ఇది నేను మరిచిపోలేని పుట్టిన రోజు..అంటోంది షీలా. సోమవారం షీలా పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే..తాను మరో రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నాను. ఇంత సంతోషాన్ని తెచ్చిన ఈ పుట్టిన రోజు నాకు నిజంగానే హ్యాపీ బర్త్‌డే. నటిగా నేను ఎదగడానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది. ఇక షీలా..పరుగు, మస్కా, అదుర్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎన్టీఆర్ సరసన 'అదుర్స్' చిత్రంలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలకృష్ణ 'పరమ వీరచక్ర'లో హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకుంది.
More from Filmibeat
షీలా దాసరి నారాయణరావు పరమవీర చక్ర పరుగు మస్కా అదుర్స్ sheela dasari narayana rao paramaveera chakra parugu maska


Click it and Unblock the Notifications











