Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆఖరుకు లైట్ బోయ్ ని కూడా వదలని షీలా
అదుర్స్ లో ఎన్టీఆర్ సరసన చేసిన షీలా కు అవకాశాలు అయితే రాలేదు కానీ ఆమె చెప్పే కబుర్లుకు మాత్రం అంతుండటం లేదు. తాజాగా తను సెట్స్ లో ఎలా ఉంటుందో వివరిస్తూ..."నాకు సరదాగా ఉండటం అంటేనే ఎక్కువ ఇష్టం. అంతెందుకు...షూటింగ్ సమయంలో కూడా సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటుంటే..నాకు భలే చిరాకు అనిపిస్తుంది. కావాలని నేను వెళ్లి అందరినీ కదిలించి మరీ నవ్విస్తాను. లొకేషన్ లోకి అడుగుపెట్టగానే ముందుగా అందరికీ హాయ్ చెబుతా...ఆఖరుకు లైట్ బోయ్ ని కూడా వదలను. వెళ్లే టప్పుడు కూడా ఉన్నవారందరికీ టాటా చెప్పి మరీ వెళతా. ఇది నాకు మొదల్నుంచీ వస్తున్న అలవాటు' అంటూ చెప్పుకొచ్చింది షీలా. లైట్ బోయ్ లతో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలనే ఆలోచన బాగానే ఉంది కానీ దర్శక, నిర్మాతలు, ముఖ్యంగా హీరోలతో కదా చనువుగా ఉండాల్సింది..అప్పుడు కదా ఆఫర్స్ వచ్చేది...లేకపోతే ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండాల్సిందే అని మిగతా సీనియర్స్ నవ్వుకుంటున్నారు.