షీలా కథ అడ్డం తిరిగింది!
'పరుగు" మినహా షీలా నటించిన చిత్రాలేవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. 'సీతాకోకచిలుక", హలో ప్రేమిస్తారా" వంటి చిత్రాలు షీలాను తీవ్ర నిరాశకు గురి చేసాయి. 'పరుగు" తర్వాతయినా తన కెరీర్ పరుగులు తీస్తుందనుకుంటె, ఆ చిత్రం తర్వాత కూడా షీలా కెరీర్ నత్త నడక నడుస్తోంది. షీలా సెకండ్ హీరోయిన్ గా నటించిన 'మస్కా" చిత్రం విడుదలైన సంవత్సరం దాటిపోయింది. ఈ నేపద్యంలో తను నటించిన తాజా చిత్రం 'అదుర్స్" పై నిజానికి షీలా బోలెడు ఆశలు పెట్టుకోవాలి.
అయితే ఇక్కడే 'సీన్ రివర్స్ అయ్యింది" అనగా దశ్యం తిరగబడింది". 'అదుర్స్" చిత్రంపై షీలా ఆశలు పెట్టుకోవాల్సింది పోయి, 'అదుర్స్" దర్శకనిర్మాతలే షీలాపై బోలెడు ఆశలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే, ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించిన నయనతార స్టిల్స్ చూస్తున్నవాళ్లంతా పెదవి విరుస్తుండడంతో,'అదుర్స్" చిత్రానికి గ్లామర్ నద్దాల్సిన బాధ్యత షీలాపై పడింది. దర్శకనిర్మాతలు తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు షీలా కూడా తన సొగసుల్ని అత్యంత ఉదారంగా అరబోయడం మనం చూస్తూనే ఉన్నాం. 'అదుర్స్" లో షీలా సొగసులు, టైటిల్ ను జస్టిఫై చేస్తూ అదుర్స్ అనిపిస్తున్నాయని అందరూ అంటున్నారు!


Click it and Unblock the Notifications











