షీలాకి మరో పెద్ద ఆఫర్

షీలా.. సీతాకోకచిలుక సినిమాతో తెలుగు తెరకు పరిచయమై,హలో ప్రేమిస్తారా , పరుగు సినిమా లో చేసింది. అందులోనూ పరుగు సినిమా పెద్ద విజయం సాధించకపోవటానికి కారణం ఆమేనని తేల్చారు. అయినా ఆమె ఇప్పుడు రెడీ వంటి పెద్ద హిట్ తో ఉన్న రామ్ ప్రక్కన ఆఫర్ సంపాదించింది. బి.గోపాల్ దర్శకత్వంలో రానున్న మస్కాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ సంపాదించింది. దాంతో ఆమె ఈ రూమర్స్ కి భిన్నంగా తన జోరును కొనసాగించటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
అందులోనూ జెనీలియాను కెరీర్ ప్రారంభంలో ఇలాగే ఐరన్ లెగ్ అని అంతా దూరంగా పెట్టారు. ఇప్పడు బాలీవుడ్,టాలీవుడ్ లలో ఆమే నెంబర్ వన్ అయింది. అలాగే షీలా అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కొందరంటున్నారు. ఇక ఈ మస్కాలో ఈ పాత్ర కోసం సంజన,మంజరి లను అనుకున్నారు. కానీ ఇప్పుడు షీలా వచ్చి చేరింది.


Click it and Unblock the Notifications











