వేసీ వేసి బోరు కోడుతోంది...షీలా
"సీతాకోక చిలుక, రాజూభాయ్, పరుగు...ఇలా ప్రతి సినిమాలోనూ లంగా ఓణీలు వేసుకునే పాత్రలు వేసీ వేసి బోరు కోడుతోంది. ఈ మూడు సినిమాల తర్వాత లంగా, ఓణి సబ్జెక్టులు చాలా విన్నాను. పర్సనల్ గా నాకు మోడ్రన్ గా కనిపించడం, ఉండటం అంటే ఇష్టం. కాని, నాకు మాత్రం అన్నీ లంగా, ఓణి పాత్రలే వస్తున్నాయి. అందుకే ఆ ఇమేజ్ లోంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో చాలా అవకాశాలను వదులుకున్నాను. 'మస్కా' కోసం ఎమ్మెస్ రాజు ఫోన్ చేసి నాది గ్లామరస్ పాత్ర అన్నప్పుడు నేను కోరుకున్న పాత్ర లభించిందని ఆనందపడ్డాను. ఇక 'అదుర్స్'లో కూడా అలాంటి పాత్రనే చేశాను. అందులో గ్లామరస్ గా బాగా కనిపించనానని కూడా చెప్పారు' అంటూ చెప్తోంది షీలా. ఆమెకు 'అదుర్స్' తర్వాత ఆమెకు ఏ ఆఫర్ రాలేదని, అందుకే పనిమాలా ఇలాంటి కబుర్లు చెబుతోందంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











