హీరోయిన్‌గా మారుతున్న టీవీ9 యాంకర్ (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

బెంగులూరు: టీవీ యాంకర్లు హీరోయిన్లుగా మారడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. మొదట బుల్లితెరపై తన టాలెంటు ఏమిటో నిరూపించుకుని....తద్వారా దర్శక,నిర్మాతల దృష్టిలో పడి సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆ జాబితాలో తాజాగా టీవీ9 కన్నడ ఛానల్ పాపులర్ యాంకర్ శీతల్ శెట్టి కూడా చేరిపోయారు.

కన్నడలో తెరకెక్కుతున్న 'Ulidavaru Kandanthe' అనే చిత్రం ద్వారా శీతల్ శెట్టి వెండితెరంగ్రేటం చేస్తోంది. ఆమె బిజీ షెడ్యూల్‌లోనూ ఆమె 'వన్ ఇండియా'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల్లోకి నటిస్తున్నప్పటికీ జర్నలిజం, టీవీ యాంకర్‌గా కొనసాగుతూనే ఉంటానని స్పష్టం చేసారు.

Ulidavaru Kandanthe చిత్రానికి రక్షిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, కిషోర్, యగ్నా శెట్టి, అచ్యుత్ కుమార్, తారా అనురాధ, రిషబ్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తనకు సినిమా అవకాశం రావడంపై శీతల్ శెట్టి మాట్లాడుతూ....ఈ అవకాశాన్ని తాను ఎంతో గొప్పగా భావిస్తున్నానని, ఎంతో మంది సినిమాల్లోకి రావాలని కలలుగంటుంటారు. ఇప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశమే' అని శీతల్ శెట్టి తెలిపారు.

యాంకరింగుతో పాలిస్తే నటన కాస్త కష్టమే అంటోంది శీతల్. 'నేను ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ హాండిల్ చేసాను. కానీ నటన అనేది నాకు పూర్తిగా కొత్త. తొలుత కొన్ని రోజులు కష్టంగానే అనిపించింది' అని ఆమె తెలిపారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు....

శీతల్‌కు ఇదొక కొత్త అనుభవం

శీతల్‌కు ఇదొక కొత్త అనుభవం

‘సినిమా అనేది నాకు పూర్తిగా సరికొత్త అనుభవం. ఎంతో మంచి టీంతో కలిసి పని చేస్తున్నారు. వీరితో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది' అని శీతల్ వెల్లడించారు.

జర్నలిస్టు పాత్రలో శీతల్

జర్నలిస్టు పాత్రలో శీతల్

Ulidavaru Kandanthe సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ...‘ఈ చిత్రంలో నేను జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాను. నేను టీవీ స్టూడియోలో చేసేదే ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ అంతా స్క్రిప్టు ప్రకారం జరుగుతుంది' అని వెల్లడించారు.

శీతల్ మొదటి వ్యక్తి

శీతల్ మొదటి వ్యక్తి

‘మా ఫ్యామిలీ నుంచి కెమెరా ముందు ఉండి నటిస్తున్న మొదటి వ్యక్తిని నేనే. నాకు ఎలాంటి థియేటర్ ఎక్స్ పీరియన్స్ లేదు. అయితే కాలేజీ రోజుల్లో చిన్న చిన్న డ్రామాలు వేసేదాన్ని' అని తెలిపారు శీతల్.

శీతల్‌కు ఎవరు ఇష్టమంటే...

శీతల్‌కు ఎవరు ఇష్టమంటే...

‘నేను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరి ప్రభావం కూడా నాపై లేదు. కానీ కన్నడ హీరోయిన్లు రమ్య, కల్పన, భారతి...బాలీవుడ్లో శ్రీదేవి, మాధురి దీక్షిత్ అంటే ఇష్టం' అని శీతల్ శెట్టి వెల్లడించారు.

ఎంపిక చేసిన పాత్రల్లో మాత్రమే...

ఎంపిక చేసిన పాత్రల్లో మాత్రమే...

‘ప్రస్తుతం నేను మంచి టీంతో కలిసి పని చేస్తున్నాను. నటిగానే కంటిన్యూ అవుతానని మాత్రం చెప్పలేను. ఒక వేళ మంచి పాత్రలు వస్తే....ఎంపిక చేసుకుని నటిస్తాను' అని శీతల్ తెలిపారు.

ప్రయోగాత్మక చిత్రాలు

ప్రయోగాత్మక చిత్రాలు

రొటీన్ సినిమాలు కాకుండా ప్రయోగాత్మక సినిమాలంటే నాకు ఇష్టం. కన్నడ మూవీ ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందాలనేదే నా కోరిక' అని శీతల్ అన్నారు.

ఎప్పటికీ జర్నలిస్టుగానే..

ఎప్పటికీ జర్నలిస్టుగానే..

జర్నలిజం అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఇప్పటికీ నా బ్లాగులో జర్నలిజంలోని అనుభవాలను షేర్ చేసుకుంటాను. జర్నలిజంతో అనుబంధం అంత సులభంగా తెంచుకోలేను' అని శీతల్ స్పష్టం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X