స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల.. ఒకటి సెట్స్‌పై ఉండగానే దర్శకుడి చేతికి మరో ప్రాజెక్ట్
డబ్బులు పెట్టే నిర్మాతలు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. సక్సెస్ రేట్ అనేది లేకుంటే ఎవరికైనా కష్టమే అవుతుంది. కొన్ని కోట్లు పెట్టి తీసిన చిత్రం పోతే నిర్మాతకు ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్ కూడా ఆ దర్శకుడి చేతిలోనే పెట్టారట. ఇదంతా చెప్పేది.. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గురించే. వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం లవ్ స్టోరీ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే.
ఫిదా వంటి మ్యాజికల్, మ్యూజికల్ హిట్ తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాపై మామూలుగానే ఓ స్థాయి అంచనాలుంటాయి. అలాంటి నాగచైతన్య, సాయి పల్లవి ఫ్రెష్ కాంబినేషన్‌తో వస్తూ ఉంటే ఇంకేస్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వీటికి తగ్గట్టే ఇంతవరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్, లిరికల్ వీడియో ఎంతగానో వైరల్ అయ్యాయి. అయితే అంతా సవ్యంగా ఉండి ఉంటే.. కరోనా రాకుండా ఉంటే.. ఈ వెచ్చని ఎండలో చల్లని ప్రేమకథను చూసేవాళ్లం. కరోనా కారణంగా లవ్ స్టోరీ వాయిదా పడింది.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వీరిద్దరి కాంబోలో తదుపరి చిత్రం కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. లవ్ స్టోరీ మీద నమ్మకం, ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్‌పై ఉన్న కాన్పిడెంట్‌తోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా శేఖర్ కమ్ములతోనే అని నిర్మాత ప్రకటించారు. అయితే ఆ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతోన్నట్టు తెలుస్తోంది. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. క్వారంటైన్‌లో శేఖర్ కమ్ముల చేస్తున్న సాయానికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హిజ్రాలకు ఆర్థిక సాయాన్ని చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నాడు శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications











