'అజయ్‌శాస్త్రి మిస్సింగ్' అంటూ శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... భర్త పేరు... అజయ్‌శాస్త్రి. వయసు 31 సంవత్సరాలు. ఎక్కడో తప్పిపోయాడు. అతని కోసమే అన్వేషణ సాగిస్తోంది భార్య అనామిక. అజయ్ కోసం ఎక్కని గడప లేదు, తిరగని చోటూ లేదు. మరి అతను ఎక్కడున్నాడు? అనామికకి దొరికాడో లేదో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు .
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనామిక' . నయనతార ప్రధాన పాత్ర పోషించింది. హర్షవర్ధన్ రాణే, వైభవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సినిమాకి హిందీలో విజయవంతమైన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా 'అనామిక' తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











