లీడర్ చిత్రం పాయింట్ ఏమిటంటే..శేఖర్ కమ్ముల
నాయకుడు ఎలా ఉంటాడు? అసలు నాయకుడికి, రాజకీయ నాయకుడికి తేడాలేమిటి? అనే పాయింటుతో మా చిత్రం నడుస్తుంది అంటున్నారు శేఖర్ కమ్ముల. వారసత్వ రాజకీయాల నేపధ్యంలో ఈ కథ,కథనం నడుస్తుంది. తను "ఎన్నికల సమయంలో టీవీ చూస్తున్నప్పుడు పుట్టిన ఆలోచనకు రూపమే 'లీడర్' అని అంటున్నారాయన. ప్రముఖ నిర్మాత రామానాయుడి మనవడు రానా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'లీడర్'. ఏవీయమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఎమ్.శరవణన్, ఎమ్మెస్ గుహన్, అరుణ, అపర్ణ నిర్మాతలు. నిర్మాతలు మాట్లాడుతూ "ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ"న్నారు. అలాగే ప్రేక్షక జనం మెచ్చేలా ఉంటుంది మా చిత్రం. నాయకుడి పాత్రకు రానా చక్కగా సరిపోయాడ"ని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, సాహిత్యం: వేటూరి అందిస్తున్నారు. హీరోయిన్స్ గా రీచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











