శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం రిలీజ్ డేట్ ఛేంజ్!?
'లీడర్' చిత్రం ముందుగా నిర్ణయించినట్లుగా 2009లో రిలీజ్ కాదని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం మొదట డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ కానుందున 2010 జనవరి మొదటి వారంలో దీన్ని ప్లాన్ చేసే యోచనలో ఉన్నారు. అయితే అఫీషియల్ గా కన్ఫర్మ కాలేదు. అసలుమొదట అక్టోబర్ రెండున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కాని షూటింగ్ లేట్ అవటం వల్ల ఈ నిర్ణయం తీసు కోవలసి వచ్చిదని తెలుస్తోంది.అలాగే రామానాయుడు మనవడు..సురేష్ బాబు కుమారుడు అయిన రాణా ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. యువత..రాజకీయాలు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో తయారుఅవుతున్న ఈ చిత్రంలో రిచా, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎవియం ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సామాజిక సందేసంతో కూడిన ఈ చిత్రంలో రాణా పాత్ర ముఖ్యమంత్రి అవుతుందని టాక్ వినపిస్తోంది. హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం. ఈ చిత్రం ఆడియో మార్కెట్లో మంచి టాక్ తెచ్చుకుంది. మిక్కీ జె.మేయర్ అందించిన ట్యూన్స్ హ్యాపీడేస్ లా వర్కవుట్ అవుతున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











