ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు(సురేష్ బాబు కుమారుడు)దగ్గుపాటి రాణా హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఎ.వి.యం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కొద్ది మంది శ్రేయాభిలాషుల సమక్షంలో సీక్రెట్ గా మొదలైంది. మీడియాని ఎవరినీ అనుమతించలేదు.ఎక్కువ హైప్ క్రియోట్ చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం యువకుల ఆలోచనలు,సోషల్ రెస్పాన్సిబులిటి వంటి అంశాలు చుట్టూ తిరిగుతుందని తెలుస్తోంది.అలాగే ఓ సాధారణ యువకుడు తన శక్తి సామర్ధ్యాలని మాత్రమే నమ్ముకుని టాప్ స్ధాయికి ఎలా వచ్చాడన్నిది కథనం అని చెప్పుకుంటున్నారు.బెస్ట్ ఆఫ్ లక్ రాణా అండ్ శేఖర్.