శేఖర్ కమ్ముల, నయనతార 'అనామిక' (వర్కింగ్ స్టిల్స్)

By Srikanya

హైదరాబాద్ : నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'అనామిక'. వయాకమ్‌ 18 మోషన్స్‌ పిక్చర్స్‌, ఎండెమోల్‌ ఇండియా, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు మీడియాకు తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఆన్ లైన్ లొకేషన్ ఫోటోలు ఇవి.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. దసరా సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.

నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

మిగతా విశేషాలు..స్లైడ్ షోలో

రీమేక్...

రీమేక్...

హిందీలో వచ్చిన 'కహానీ'కి ఇది రీమేక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, ముర్గి మార్కెట్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ చిన్నా నేతృత్వంలో దుర్గామాత సెట్ ని పద్మారావు నగర్ లో వేసి చిత్రీకరిస్తున్నారు. వైభవ్‌, పశుపతి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

ప్రియమణి గెస్ట్..

ప్రియమణి గెస్ట్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరోయిన్ ప్రియమణి అతిథి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గెస్ట్ రోల్ చేయడానికి ప్రియమణి ఒప్పుకుందని, ప్రియమణిపై త్వరలో కొన్ని సీన్లు చిత్రీకరించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

అంచనాలు..

అంచనాలు..

ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ తరహాలో ఇక్కడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ సహకారం..

యండమూరి వీరేంద్రనాథ్ సహకారం..

బాలీవుడ్ మూవీ ‘కహానీ'లో విద్యా బాలన్ పోషించిన పాత్రను ఇందులో నయనతార పోషిస్తోంది. .. కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.

బ్యాక్ డ్రాప్ ఛేంజ్..

బ్యాక్ డ్రాప్ ఛేంజ్..

కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

నచ్చే విధంగా...

నచ్చే విధంగా...

ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు.

కొత్తదనం కోసమే...

కొత్తదనం కోసమే...

నయనతార మాట్లాడుతూ...''కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటికీ మూస పాత్రలకే పరిమితమైతే ప్రేక్షకులు ఏమాత్రం హర్షించరు. అందుకే కాస్త్తెనా కొత్తదనం ఉన్న కథలనే ఎంచుకొంటున్నాను''అని చెబుతోంది నయనతార. నటన ప్రదర్శించడానికి ఇప్పుడు చక్కటి అవకాశం లభిస్తోందని చెబుతోంది.

మంచి పరిణామం...

మంచి పరిణామం...

'చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన రోజులతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాణిజ్య చిత్రాల్లో మాత్రమే అవకాశం దొరికేది. పాటలు, డ్యాన్సులతోనే గడిచిపోయేది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదొక మంచి పరిణామం'' అని చెప్పుకొచ్చింది నయనతార.

అందుకే ఒప్పుకున్నా...

అందుకే ఒప్పుకున్నా...

కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా' అంటోంది నయనతార.

హాలీవుడ్ స్పూర్తి తో..

హాలీవుడ్ స్పూర్తి తో..


అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

కీరవాణి సంగీతం..

కీరవాణి సంగీతం..

ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

అజిత్ చిత్రం..

అజిత్ చిత్రం..

ఇక ఈ చిత్రానికన్నా ముందే అజిత్ తో నయనతార చేసిన ఆరంభం రిలీజ్ అవుతోంది. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం హిట్టైతే అనామిక బిజినెస్ ఓ రేంజిలో పెరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X