'మేడే' రోజే... శేఖర్ కమ్ములకు అగ్ని పరీక్ష

By Srikanya

హైదరాబాద్ : తనదైన శైలిలో చిత్రాలు రూపొందిస్తూ ఓ వర్గం ప్రేక్షకులకు అభిమాన దర్శుడుగా ఎదిగిన శేఖర్ కమ్ములకు మేడే(మే 1 వ తేదీ) పరీక్షగా నిలవనుంది.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం పరాజయంతో వెనకబడిన శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం 'అనామిక' ని చాలా కాలంగా ముస్తాబు చేస్తున్నారు. ఇది పునర్మాణ చిత్రం కావటంతో హిట్టైనా శేఖర్ కమ్ములకు పెద్దగా కలిసివచ్చేది లేకపోయినా ...తేడా చేస్తే మాత్రం రీమేక్ కూడా చేయలేకపోయాడనే అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాను తెలుగు,తమిళ భాషల్లో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను వినూత్నరీతిలో ఈ నెల 16న విడుదల చేయనున్నారు.

Shekar Kammula's Anamika ready for Release on May 1st

నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

అలాగే...నా దృష్టిలో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 'కహానీ' ఆధారంగా రూపొందుతున్న చిత్రమే అయినా... రెండింటిమధ్య ఏమాత్రం పోలికలు కనిపించవు. మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో పూర్తిస్థాయిలో మార్పులు చేశారు శేఖర్‌ కమ్ముల. విద్యాబాలన్‌ పోషించిన పాత్రతో నా పాత్రని ఎవ్వరూ పోల్చి చూసుకోలేరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ''అన్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X