మహేష్, పవన్ కళ్యాణ్ లను కలిసినా...శేఖర్ కమ్ముల
మహేష్ బాబు, గోపీచంద్ లతోపాటు పవన్ కల్యాణ్‌ను కూడా కలిశాను. కానీ మేం సరిగా కమ్యూనికేట్ చేయలేదనుకుంటా..వర్కవుట్ కాలేదు అంటున్నారు ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల. 'ఆనంద్' తర్వాత పెద్ద సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయలేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ పై విధంగా స్పందించారు. ఆదివారం రాత్రి ఓ పాపులర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో...ఆనంద్ తర్వాత రాసింది గోదావరి. దానికి చాలామంది హీరోలను అడిగాం.ఫలించలేదు. అంటే...ఒక డైరెక్టర్‌గా వాళ్లెవరూ గుర్తించలేదు అనుకోవాలి. అయినా నా దగ్గర పెద్ద హీరోలతో చేయడానికి కథలు లేవంతే. కథ దొరికితే హీరో కాళ్లు పట్టుకునైనా చేయించుకుంటా. నాకు ఈగో లేదు అన్నారాయన. రాణా ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన లీడర్ చిత్రం రీసెంట్ గా రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం గురించి చెబుతూ...2008 సమ్మర్ లో లీడర్ కథ సిద్ధం చేశాను. అప్పుడు ఎన్నికల హడావుడి. దీని మూలాలన్నీ మహాభారతం నుంచి తీసుకున్నాను. ఎన్నికలు పూర్తయ్యాక చిత్రీకరణ ప్రారంభించాం. సినిమా మొత్తం పూర్తిచేశాక వైఎస్ కు చూపిద్దామనుకున్నా..చిత్రీకరణ ప్రారంభం కాగానే..సినిమా కథలోలాగే..రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయారు. ఇది అతిపెద్ద కాకతాళీయం అన్నారు.


Click it and Unblock the Notifications











