twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి, శంకర్ సినిమాలని ప్రస్తావిస్తూ.. దుమ్మెత్తిపోసిన ప్రముఖ దర్శకుడు!

    |

    దక్షణాది చిత్ర పరిశ్రమ సాధిస్తున్న అప్రతిహత విజయాలతో నార్త్ లో కదలిక మొదలయింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలనుంటే సౌత్ సినిమాని చూసి బాలీవుడ్ వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. దక్షణాది దర్శకులు సాధిస్తున్న విజయాల్ని ప్రశంసిస్తూనే.. బాలీవుడ్ లో ఆ స్థాయి చిత్రాలు ఎందుకు రావడం లేదు అనే మేధోమధనం అక్కడి సినీ ప్రముఖుల్లో మొదలైంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    బాహుబలి, 2.0

    బాహుబలి, 2.0

    ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎంతో మంది దిగ్గజ దర్శకులు వచ్చారు. ప్రస్తుతం భారత చలనచిత్ర రంగ స్థాయిని పెంచే చిత్రాలు చేస్తున్న దర్శకుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా రాజమౌళి, శంకర్ గురించి ప్రస్తావించాలి. రాజమౌళి, శంకర్ చిత్రాలలో ఎంత భారీ తనం ఉంటుందో వారు సాధించే విజయాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. బాహుబలి చిత్రంతో రాజమౌళి భారత సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఇక 2.0తో శంకర్ మనం హాలీవుడ్ వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.

    రాజమౌళి, శంకర్ సినిమాలని ప్రస్తావిస్తూ

    తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారేలా ఉన్నాయి. రాజమౌళి, శంకర్ సినిమాలని ప్రస్తావిస్తూ ఆయన బాలీవుడ్ దర్శకులకు చురకలు అంటించారు. దక్షణాది దర్శకులకు భారీ విజయాలు సాధ్యం అవుతున్నాయి. కానీ బాలీవుడ్ దర్శకులు మాత్రం ఆ స్థాయిని అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. లోపం ఎక్కడ ఉంది అని శేఖర్ కపూర్ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలి1, బాహుబలి 2, 2.0 చిత్రాలు సాధించిన విజయాల్ని గుర్తు చేసారు. దీనిని బట్టి నార్త్ దర్శకులకంటే సౌత్ దర్శకులకే సినిమా పట్ల ఎక్కువ అంకితభావం ఉందని అన్నారు.

    తీవ్రంగా నిరాశపరిచింది

    తీవ్రంగా నిరాశపరిచింది

    ఇటీవల విడుదలైన అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంపై బాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకుంది. బాహుబలి రికార్డులని అధికమిస్తుందని అంచనాకూడా వేశారు. కానీ సినిమా విడుదలయ్యాక అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంతీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల బాలీవుడ్ నుంచి గొప్పగా అనిపించే చిత్రం ఏదీ రాలేదు. దీనితో బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ అసహనాని వ్యక్తం చేస్తున్నారు.

    కరణ్ జోహార్ కూడా ఘాటుగానే

    కరణ్ జోహార్ కూడా ఘాటుగానే

    శేఖర్ కపూర్ కంటే ముందుగా ఇలాంటి వ్యాఖ్యలని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ చేశారు. బాహుబలి 2 లాంటి అద్భుత చిత్రాలని దక్షణాది దర్శకులు మాత్రమే చేయగలరు. హిందీలో ఇలాంటి చిత్రాలు సాధ్యం కాదు. కానీ రెమ్యునరేషన్ మాత్రం సౌత్ దర్శకుల కంటే నార్త్ దర్శకులే ఎక్కువగా తీసుకుంటారని కరణ్ జోహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    English summary
    Shekhar Kapoor slams Bollywood directors. North Directors are failing to make big movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X