twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన లేకుండా 'మిస్టర్.ఇండియా 2' చేయలేం

    By Srikanya
    |

    శ్రీదేవి, అనీల్ కపూర్ కాంబినేషన్ లో శేఖర్ కపూర్ రూపొందించిన అద్బుతం 'మిస్టర్‌ ఇండియా'. 1987లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రం సీక్వెల్ నిర్మాణమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేఫద్యంలో 'మిస్టర్‌ ఇండియా'దర్శకుడు శేఖర్ కపూర్ ఈ విషయమై ట్వీట్ చేసారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మొగాంబో చేసి అందరి మనస్సులో నిలిచిపోయిన వ్యక్తి అమ్రీష్ పూరి. ఆయన ఏనవర్శిసీ సందర్భంగా శేఖర్ కపూర్ స్పందించారు.

    శేఖర్ కపూర్ ట్వీట్ లో "అమ్రీష్ పూరి ఇండియన్ సినిమా మీద మరిచిపోలేని తన దైన మార్క్ ని వదిలారు. ఆయన లేని మిస్టర్ ఇండియా 2 ని ఊహించలేం..ఆయన్ను మిస్ అవుతున్నాం " అని అమ్రీష్ పూరీ మీద తనకున్న అబిమానాన్ని చాటుకున్నారు శేఖర్ కపూర్. ఇక నిర్మాత బోనీకపూర్ ఆ మధ్యన సీక్వెల్ చేద్దామని ప్రయత్నించారు. అయితే ఆమె భర్త బోనీకపూర్ మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ ని కలుసుకుని ఈ సినిమానీ డైరక్ట్ చేయమని అడిగారు. అయితే శేఖర్ అంతర్జాతీయ ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చెయ్యలేనని సున్నితంగా తిరస్కరించాడు.

    దాంతో అంత బాగా మళ్లీ తెరకెక్కించటం కష్టమని భావించిన బోనీకపూర్ ఇప్పుడు సీక్వెల్ ఆలోచన విరమించుకుని త్రీడికి శ్రీకారం చుట్టారు.ఈ ఆలోచనకు పదిహేనేళ్ల క్రిందటి వచ్చిన 'టైటానిక్‌'ప్రేరణ ఇచ్చింది. 'టైటానిక్‌' చిత్రాన్ని త్రీడీలో మరోమారు చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జేమ్స్‌ కామెరాన్‌. ఆయన దర్శకత్వం వహించిన 'టైటానిక్‌' ఇటీవల త్రీడీలో తెరపైకి వచ్చింది. దీనికి వచ్చిన స్పందన మన దర్శకనిర్మాతల్ని ఆలోచింపజేస్తోంది. 'మిస్టర్‌ ఇండియా' చిత్రాన్ని ఇప్పుడు త్రీడీలోకి మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు త్రీడీలోకి మార్చే వ్యవహారాలపై చర్చలు సాగిస్తున్నట్లు బోనీ స్పష్టం చేశారు. బహుశా వచ్చే ఏడాది మే నుంచి త్రీడీ పనులు మొదలుపెట్టి 2014లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాతే రెండో భాగాన్ని రూపొందిస్తామని బోనీ తెలిపారు.

    ఇక ఈ త్రీడి చిత్రం అన్ని వర్గాల వాళ్ళని అలరించనున్నట్లు నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ త్రీడి కోసం నిపుణలు పని ప్రారంభించినట్లు చెప్తున్నారు. శ్రీదేవి సైతం తను త్రిడిలో కనపించటంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. సీక్వెల్ కన్నా ఇదే సరైన వ్యవహారమని ఆమె భావిస్తోంది. ఈ త్రీడి చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో సైతం డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అయితే మరిన్ని క్లాసిక్స్ త్రిడిలో వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Shekhar Kapur says he can't think of a sequel to "Mr.India" without the actor. "Amrish Puri left an indelible mark on Indian cinema. Can't think of 'Mr India 2' without him. We miss him," Kapur tweeted. The actor played iconic villain Mogambo in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X