నా శేఖర్ సినిమా జోలికి వస్తే... నష్టం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తా - నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి హెచ్చరిక

ప్రముఖ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, ఆయన కూతురు శివాత్మిక నటించిన శేఖర్ చిత్రం మే 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులతో ప్రశంసలు, సినీ విమర్శకుల మెప్పు పొందిన ఈ చిత్రాన్ని కొందరు వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారు. అయితే తమ చిత్రంపై దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న కొందరిని ఉద్దేశించి నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. శనివారం (మే 21వ తేదీన) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ..

 హీరో రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో

హీరో రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో

హీరో రాజశేఖర్ నా చిన్నప్పటి ఫెవరేట్ హీరో తనంటే నాకు ఎంతో ఇష్టం గరుడవేగ సినిమాకు తనతో జర్నీ చేశాను.ఆ పరిచయంతో వారు మళ్లీ సినిమా చేద్దామని చెప్పారు. మేము చేసిన రీమేక్ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. జోసెఫ్ సినిమా బాగుంది చేద్దామని జీవిత రాజశేఖర్ లు చెప్పడంతో.. కోవిడ్ టైంలో దుబాయ్ లో ఉన్న నేను మలయాళం జోసెఫ్ సినిమా చూడడం జరిగింది.

ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మలయాళం సినిమా కదా తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా లేదా అనుకున్నాం. అయితే చూసిన ప్రేక్షకులందరూ క్లైమాక్స్ అదిరిపోయింది రాజశేఖర్ ఆడియన్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పడంతో మాకు చాలా సంతోషం వేసింది. మా సినిమాను రిసీవ్ చేసుకొని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అని బీరం సుధాకర్ రెడ్డి అన్నారు.

ఓటీటీ కోసం తీయలేదు అంటూ

ఓటీటీ కోసం తీయలేదు అంటూ

శేఖర్ ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేద్దామనే తీశాము తప్ప ఓటీటీ కోసం ఈ సినిమా తీయలేదు. జీవిత మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో దర్శకురాలిగా తనైతే కరెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ ను జీవిత గారికే అప్పజెప్పడం జరిగింది.ఈ సినిమా కు వారంతా చాలా కష్టపడ్డారు. వారి కష్టానికి మాకు ఫలితం దక్కింది ఆనుకుంటున్నాను అని బీరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అంటూ

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అంటూ

హీరో రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో రూపొందించిన శేఖర్ సినిమాపై కొందరు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వారికి తగిన విధంగా బుద్ది చెబుతాం. కేసులు వేస్తే బెదిరిపోయే వాళ్లం కాదు. వారితో అమీతుమీ తేల్చుకొంటాం అని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

నా సినిమాకు కష్టం కలిగిస్తే..

నా సినిమాకు కష్టం కలిగిస్తే..

శేఖర్ చిత్రానికి నేను నిర్మాతను. జీవితా రాజశేఖర్ మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్ హీరోగాగా నటించారు. వాళ్లిద్దరికి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే సహించేది లేదు అని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

పరువు నష్టం దావా వేస్తా అంటూ

పరువు నష్టం దావా వేస్తా అంటూ

శేఖర్ సినిమాపై అవాస్తవాతో దుష్ర్పచారం చేస్తే ఊరుకోను. నా సినిమాకు ఎలాంటి నష్టం జరిగినా, నేను వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతాను. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. వారి డిమాండ్లకు అర్ధం లేదు. ఎందుకంటే అసలు నిర్మాతను నేను అని నిర్మాత మీడియాకు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X