twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోర్... (‘షేర్’ మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్: కళ్యాణ్ నటించిన ‘షేర్' చిత్రం ఈ రోజు విడుదలైంది. ‘పటాస్' లాంటి హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు అంటూ ఇంతకాలం సినిమాను ప్రమోట్ చేసారు. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించాడో రివ్యూలో చూద్దాం...

    కథ విషయానికొస్తే...
    స్టోరీలో కొత్తగా చెప్పుకోవడానపికి ఏమీ లేదు. రొటీన్ రివేంజ్ డ్రామా. కథ గురించి సూటింగా చెప్పాలంటే గౌతం అనే వ్యక్తి కథ. తన తల్లిని, సోదరుడికి చంపిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాడు. అతని జీవితంలోకి విలన్స్ ఎందుకు వచ్చారు? తన వారిని ఎందుకు చంపారు? అతని లవ్ లైఫ్ ఏమిటి మిగతా స్టోరీ.

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే..
    కళ్యాణ్ రామ్ గత సినిమాల కంటే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. యాక్టింగ్ స్కిల్స్, సెన్సాఫ్ హ్యూమర్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటిలోనూ అదరగొట్టాడు. డాన్స్, కామెడీ టైమింగులో కూడా మెప్పించాడు. ఇక యాక్షన్ సీన్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇరగదీసాడు. సోనాల్ చౌహాన్ తన అందచందాలతో సినిమాకు మరింత గ్లామర్ అద్దింది. విక్రమ్ జీత్, ముకేష్ రిషి, షాయాజీ షిండే తమ తమ పాత్రల్లో బాగా నటించారు. పవన్ కళ్యాణ్, ఇతర స్టార్లను ఇమిటేట్ చేస్తూ బ్రహ్మానందం కామెడీ ఫర్వాలేదు.

    టెక్నికల్ గా చూస్తే...
    ఈ సినిమాకు డైమండ్ రత్నం, దర్శకుడు ఎం మల్లికార్జున్ కథ అందించారు. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఇక స్క్రీన్ ప్లే మీ సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో చాలా సీన్ల ఇతర సినిమాల్లో నుండి తీసుకొచ్చి పెట్టినట్లు ఉంటుంది. ఈ చిత్రానికి దివంగత సంగీత దర్శకుడు చక్రి, తమన్ సంగీతం అందించారు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బావుంది.

    గతంలో మల్లికార్జున్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ అభిమన్యు, కత్తి లాంటి ప్లాప్ సినిమాలు. అయినప్పటికీ మరోసారి అతన్నే దర్శకుడిగా ఎంచుకుని ‘షేర్' సినిమా చేసిన కళ్యాణ్ రామ్ మరోసారి పొరపాటు చేసాడని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కథ, కథనంలో దర్శకడు పూర్తిగా విఫలం అయ్యాడు. అయితే సినిమాలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తుంది.

    నటీనటులు:నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ , బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరుల నటించారు. కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌.,
    సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌,
    కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌. విడుదల తేదీ: 30, అక్టోబర్ 2015.

    స్లైడ్ షోలో సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయాలు..

    ఔట్ డేటెడ్ నారేషన్

    షేర్ సినిమా ఔట్ డేటెడ్ నారేషన్ అంటూ...

    సినిమాలు తీయక పోవడం బెటర్

    ఇలాంటి సినిమాలు తీసేకంటే అసలు సినిమాలే తీయక పోవడమే బెటర్ అంటూ...

    రొటీన్..

    రొటీన్ సినిమా అంటూ మరికొరు...

    రెగ్యులర్ కమర్షియల్ మూవీ

    ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంటూ ఓ అభిమాని.

    గెటప్ గురించి..

    ఫస్ట్ సాంగులో రాముడు, కృష్ణుడు గెటప్ గురించి...

    టోటల్ డిసప్పాయింట్

    షేర్ సినిమా మమ్మల్ని పూర్తిగా డిసప్పాయింట్ చేసింది అంటూ...

    డైలాగ్స్ బావున్నాయి

    డైమండ్ రత్నం డైలాగులు బావున్నాయి అంటూ మరొకరు.

    సోనల్ చౌహాన్

    సినిమాలో సోనాల్ చౌహాన్ చాలా అందంగా ఉందంటూ..

    English summary
    Kalyan Ram, who started off the year with a remarkable hit Pataas, is here with his next offering Sher, in the theaters near to you. Before ypu watch the movie, read the review here to know what is in store.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X