తెలంగాణ ఏర్పాటుపై ప్లేబాయ్ బ్యూటీ స్పందన ఇలా..!
'ఈ విభజన బాధ్యత పూర్తిగా ప్రజలదే. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలచే అనే వ్యవస్థ అమలులో ఉంది. ప్రత్యేక రాష్ట్రాలు సెట్ కావడానికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది' అని షెర్లిన్ చోప్రా వ్యాఖ్యానించింది. క్రిస్టియన్ ఫాదర్, ముస్లిం మదర్‌కు జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. స్వస్థలం హైదరాబాద్.
హైదరాబాద్ లో ఉన్నప్పుడు కాలేజీ రోజుల్లో మిస్ ఆంధ్రా పెజెంట్ అవార్డు దక్కించుకుంది. అనంతరం పలు స్మాల్ బడ్జెట్ సినిమాలైన టైం పాస్, స్వస్తిక్, గేమ్ చిత్రాల్లో నటించింది. ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్రకెక్కింది.
ప్రస్తుతం షెర్లిన్ చోప్రా....'కామసూత్ర 3డి' అనే శృంగార చిత్రంలో నటిస్తోంది. వాత్సాయన కామసూత్ర ఆధారంగా దర్శకుడు రూపేష్ పాల్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆమె నగ్నంగా నటించిన ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి.


Click it and Unblock the Notifications












