మోసం చేసాడంటూ దర్శకుడిపై హాట్ హీరోయిన్ కేసు

అయతే ఈ సినిమా ఇంకా నిర్మాణం పూర్తి కాకముందే హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు, దర్శకుడు రూపేష్ పాల్ మధ్య విబేధాలే తెలత్తాయి. ఇటీవల షెర్లిన్ చోప్రా ఈ సినిమా నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం దర్శకుడు రూపేష్ పాల్ కూడా షెర్లిన్ చోప్రా లేకుండా టీజర్ విడుదల చేసారు.
తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదం పోలీసుల వరకు వెళ్లింది. దర్శకుడు రూపేష్ పాల్ తన సంతకం ఫోర్జరీ చేసాడని, కాంట్రాక్టు విషయంలో మోసం చేసాడని, తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ....అడిషనల్ కమీసనర్ ఆఫ్ పోలీస్ విశ్వాస్ నన్గారె పాటిల్ తో పాటు, ముంబైలోని శాంతాక్రజ్ సీనియర్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది షెర్లిన్.
దర్శకుడు రూపేష్ పాల్ తన సంతకంతో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడని, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం చెల్లించకుండా మోసం చేసాడని తన ఫిర్యాదు పేర్కొంది. అతనితో పనిచేసే సమయంలో సెక్సువల్ టార్చర్ పెట్టే వాడని, అతని నిర్ణయాలకు నిరాకరిస్తే నిన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను తీసుకుంటానని బెదిరించే వాడని, అతని నుండి అసభ్యకరమైన, వల్గర్ మెయిల్స్ కూడా వచ్చే వని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. దర్శకుడు రూపేష్ పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.


Click it and Unblock the Notifications











