సెక్సీ హీరోయిన్‌కి, దర్శకుడికి మధ్య కామసూత్ర అగ్రిమెంట్
ఆ మధ్య షెర్లి చోప్రా ఈ సినిమాకు సంబంధించిన తన అర్ధ నగ్న వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్ ద్వారా లీక్ చేసి తన అభిమానులకు కన్నులవిందు చేసింది. ఆమె ఎద భాగంలో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న ఆ హాట్ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఈ వీడియోను దర్శక నిర్మాతల అనుమతి లేకుండా షెర్లిన్ చోప్రా రిలీజ్ చేయడంతో షెర్లిన్ చోప్రాకి, దర్శకనిర్మాతలకి మధ్య వివాదం ఏర్పడింది.
ఓ క్రమంలో ఇరు వర్గాల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడంతో సినిమా నుంచి షెర్లిన్ చోప్రాను తొలగించి ఎవరైనా హాలీవుడ్ హీరోయిన్‌తో ఆ పాత్ర చేయించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఆ వీడియో కామసూత్ర సినిమాలోనిది కాదని, అది స్క్రీన్ టెస్టు కోసం తీసిన వీడియో మాత్రమే అని దర్శక నిర్మాతలు ఆ మధ్య ప్రకటించారు కూడా.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇరు వర్గాలు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హీరోయిన్ షెర్లిన్ చోప్రా, దర్శకుడు రూపేష్ పాల్ మధ్య కామసూత్ర సినిమాకు సంబంధించిన ఓ అగ్రిమెంట్ కుదిరిననట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాత అనుమతి లేకుండా తాను ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు, సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు లీక్ చేయడం కానీ చేయనని షెర్లిన్ చోప్రా ఆ అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు సమాచారం.
సినిమాకు సంబంధించిన ఇతర విశేషాల్లోకి వెళితే, బహుముఖ నటుడు నాజర్ సెక్స్ చిత్రం 'కామసూత్ర 3డి'లో మెయిన్ రోల్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాజర్ పాత్ర విషయానికొస్తే... రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని సామ్రాజ్యంపై మొఘలులు దాడి చేసి వశ పరుచుకుంటారు. ఆ తర్వాత అతను మానసికంగా సఫర్ అయిన అధికారం లేని జీవితం గడుపుతాడు. ఇందులో నాజర్ కూతురుగా షెర్లిన్ చోప్రా కనిపించనుంది.


Click it and Unblock the Notifications












