షెర్లిన్ చోప్రా ‘కామసూత్ర’ సెట్లో అగ్నిప్రమాదం
ముంబై: షెర్లిన్ చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న 'కామసూత్ర 3డి' చిత్రం సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని తొట్టుకూడి ఓల్డ్ హార్బర్ సమీపంలో ఈ సెట్ వేసారు. బోట్లో వేసిన సోట్లో ఈ ప్రమాదం సంభవించింది. ఇందుకుగాను రూ. 1.5 లక్షల నష్ట పరిహారం బోటు యజమానికి చెల్లించేందుకు నిర్మాతలు అంగీకరించారు.
'కామసూత్ర 3డి' చిత్రం వాత్సాయన కామసూత్ర గ్రంథం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మనవుని శృంగార కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను ఈ చిత్రంలో ఫోకస్ చేయనున్నారు. ఈ చిత్రంలో షెర్లిన్ చోప్రా మెయిన్ రోల్ పోషిస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే షూటింగ్ శిబిరం నుంచి బయటకు పరుగులు తీసారు.
ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటించింది. స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని మరింత ఎక్కువ చేసింది.
ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ..... 'నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు. ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్ అంటోంది.


Click it and Unblock the Notifications












