ఆఫర్ అడిగితే రాంగోపాల్ వర్మ ఆ వీడియో పంపించాడు: బయటపెట్టిన హైదరాబాద్ హీరోయిన్

సినీ రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొందరు మాత్రమే బోల్డ్ అండ్ ఫైర్ బ్రాండ్ లేడీలుగా గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది షెర్లిన్ చోప్రా ఒకరు.

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. మూవీల కంటే వివాదాలతోనే ఎక్కువగా హైలైట్ అయింది. ఇప్పుడేమో కొన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెర్లిన్ చోప్రా.. దర్శకుడు రాంగోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

Sherlyn Chopra Sensational Allegations on Tollywood Director Ram Gopal Varma

మిస్ ఆంధ్రా.. టాలీవుడ్‌లోకి
బోల్డ్ లేడీ షెర్లిన్ చోప్రాది హైదరాబాద్ అన్న విషయం తెలిసిందే. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 'వెండిమబ్బు' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత షెర్లిన్ చోప్రా 'ఏ ఫిల్మ్ బై అరవింద్', 'సంథింగ్ స్పెషల్' సహా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Sherlyn Chopra Sensational Allegations on Tollywood Director Ram Gopal Varma

బాలీవుడ్‌లోకి వెళ్లి మారింది

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలను మాత్రం షెర్లిన్ చోప్రా అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడు ముంబై వెళ్లిపోయి బాలీవుడ్‌ ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే 2012లో ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించింది. ఆ తర్వాత సంచలన చిత్రం 'కామసూత్ర 3డీ'లోనూ పూర్తి నగ్నంగా నటించింది. తర్వాత అక్కడ ఆఫర్లను అందుకుంది.

ఆర్జీవీపై సంచలన ఆరోపణ
సెన్సేషనల్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో గతంలో మాదిరిగానే కాస్టింగ్ కౌచ్, మీటూ అనుభవం గురించి మరోసారి మాట్లాడింది. ముఖ్యంగా షెర్లిన్ చోప్రా ఈ ఇంటర్వ్యూలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఊహించని విధంగా ఆరోపణలు చేసింది. తద్వారా మరోసారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.

Sherlyn Chopra Sensational Allegations on Tollywood Director Ram Gopal Varma

ఏదైనా ఆఫర్ ఇవ్వండి అని

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ... 'నాకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయన సినిమాలు బాగుంటాయి. అందులో హీరోయిన్‌ను మంచిగా చూపిస్తాడు. అందుకే 2016లో ఆయనకు వాట్సాప్‌లో నా ఫొటోలు, నా వివరాలు పంపాను. మీ సినిమాలో ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి అని అడిగాను' అని ఆమె చెప్పుకొచ్చింది.

Sherlyn Chopra Sensational Allegations on Tollywood Director Ram Gopal Varma

ఆ సీన్స్ తప్ప ఏమీ లేవని
షెర్లిన్ కంటిన్యూ చేస్తూ.. 'నా మెసేజ్‌కు వర్మ రిప్లై ఇస్తూ.. ''ఓ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం'' అని అన్నాడు. కానీ, ఆ స్క్రిప్టు చదివితే సెక్స్ సీన్స్ తప్ప ఏమీ కనిపించలేదు. అందులో రాజు రాణికి మధ్య సెక్స్ సీన్స్ ఉంటాయని మాత్రమే వర్మ రాశాడు. నేను ప్రశ్నిస్తే నచ్చితే చెయ్ లేకపోతే లేదు అన్నాడు' అని తెలిపింది.

Sherlyn Chopra Sensational Allegations on Tollywood Director Ram Gopal Varma

ఆ వీడియోను పంపించాడు

షెర్లిన్ కొనసాగిస్తూ.. 'నేను ఆయనను ప్రశ్నిస్తూ మెసేజ్ చేయగానే వర్మ నాకో వీడియో పంపాడు. అందులో శృంగార సన్నివేశాలు ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయిపోయాను. వెంటనే కోపంగా నాకెందుకు ఇది పంపారని కోపంగా రిప్లై ఇచ్చాను. దీంతో ఆయన అది సాధారణ విషయం అన్నట్లు మాట్లాడాడు. కానీ, తర్వాత నన్ను ఇబ్బంది పెట్టలేదు' అని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X