అందరూ బికినీలలో తిరిగాలన్నదే ఆ హీరోయిన్ ఆశయం
ఎ ఫిలిమ్ బై అరవింద్, సమ్ ధింగ్ సమ్ ధింగ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన షెర్లిన్ చోప్రా ఎప్పుడూ ఏదో సంచలనం చేసి వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతుంది. తాజాగా ఆమె బికినీ క్లబ్ ఒకటి ప్రారంభించాలని ఆత్రుత పడుతోంది. ఆ విషయం మీడియాతో ప్రస్తావిస్తూ.."మామూలుగా స్లిమ్‌గా ఉండేవారిని 'హవర్‌గ్లార్ ఫిగర్' అంటారు. ఇటువంటివాళ్లకు బికినీలు బాగా నప్పుతాయి. అయితే లావుగా ఉండేవారికి కూడా రకరకాల దుస్తులు ధరించాలని, హాయిగా ఈత కొడుతున్నప్పుడు బికినీ ధరించాలని ఉంటుంది. అలాంటివారి కోసం కూడా ప్రత్యేకంగా ఈత దస్తులు తయారు చేయిస్తున్నాను. జీరో సైజ్ నుంచి బడా సైజ్ వరకు...ఎవరికైనా మా వద్ద బికినీలు ధరిస్తాయి అంటోంది షెర్లిన్ చోప్రా. ఏదో సంచలనం చేసి వార్తల్లో నిలిచే ఈ సెక్సీ హీరోయిన్ తాజాగా 'బికినీ స్టూడియో' ఆరంభించడానికి ఆమె సన్నాహాలు చోస్తోంది. దీనికోసం ఆమె కొంతమంది ప్రొఫెషనల్ డిజైనర్స్‌ను పనికి కుదుర్చుకోనుంది. దీని గురించి చెబుతూ...నా బికినీ స్టూడియో బాగా పాపులర్ అవుతుందనే నమ్మకం ఉంది. కేవలం ఈతదుస్తులు మాత్రమే లభించే షాప్స్ చాలా తక్కువగా ఉంటాయి. ముంబయ్ లో ఓ ప్రముఖ ఏరియాలో షాప్ ఆరంభించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాను' అంటోంది. అంటే తాను మాత్రమే కాకుండా మిగతా లేడీస్ ను కూడా ఈ బికినీలో చూపి అందాల విందు చేయాలని ఆమె ప్రయత్నిస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











