సెక్స్ బాంబ్ కు ట్విట్టర్ లో అవమానం
ఫిల్మ్ సర్కిల్స్ లో స్పీడుగా డవలప్ అవుతున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్. అందులో సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రాకి ఎక్కౌంట్ ఉంది. అయితే ఆమె ఈ మధ్య ఓ అర్ధనగ్నంగా ఉండే తన ఫోటోని పోస్ట్ చేసింది. దాన్ని ట్విట్టర్ కమ్యూనిటీ వారు తీసేసారు. అంతేగాక ఇకనుంచి ఆమెను ఫోటోలు పెట్టవద్దని ఆమెపై బ్యాన్ లాంటిది పెట్టారు. దాన్ని షెర్లిన్ చోప్రా అవమానంగా భావిస్తోంది. వారు తమను సంప్రదించకుండా ఫోటో ఎందుకు తీసివేయాల్సి వచ్చిందో చెప్పాలని షెర్లిన్ డిమాండ్ చేస్తోంది. ఆమె మాటల్లోనే...నేను మా టీమ్ ని ట్విట్టర్ లో టచ్ లో ఉండి ఆ మేటర్ ఏంటో తెలుసుకోమని పురమాయించాను. నేను అనుకోవటం ఇది ఒక టెంపరరీ సిట్యువేషన్. త్వరలోనే అంతా సెట్ అవుతుందని భావిస్తున్నాను. అంతగా ట్విట్టర్ వారు పట్టుబడితే నేను వేరే సోషల్ నెట్ వర్క్ సైట్ ని ఆశ్రయిస్తాను అంది. అంటే బాల్ ట్విట్టర్ చేతిలోనే ఉందన్నమాట.


Click it and Unblock the Notifications











