Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజోలులో బిజీగా స్టార్ హీరో సిద్దార్ధ
''బావ అనే పదంలోనే ఓ తీయదనం వుంది. సిద్దార్థ్ పోషించే పాత్ర కూడా అలాగే వుంటుంది.,,అంటున్నారు 'బావ" దర్శకుడు రాంబాబు.ప్రస్తుతం ఈ చిత్రం రాజోలులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ...లవబుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా వుంటుంది. సిద్దార్థ్ సరసన కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. రాజోలులో పదిరోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం""అన్నారు.
నిర్మాత ఎం.ఎల్.పద్మాకుమార్ చౌదరి మాట్లాడుతూ-''స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. కొంటెతనం, అల్లరి తనం, చిలిపితనం కలగలిసిన పాత్రలు అనేకం ఇందులో వుంటాయి. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ పోషిస్తున్న పాత్ర చాలా అద్భుతంగా వుంటుంది. సిద్దార్థ్, రాజేంద్రప్రసాద్‌ల మధ్య జరిగే సన్నివేశాలు హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి""అని అన్నారు.
సిద్ధార్థ్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రదారులుగా రాంబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకీర్తి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్.పద్మాకుమార్ చౌదరి, దర్శకత్వం: రాంబాబు.