ఏది మానవత్వం? నటి ఆత్మహత్య (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటి శిఖా జోషి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాత్రూంలో కత్తితో గొంతుకోసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె స్నేహితులు కొందరు అక్కడికి వచ్చారు. అయితే ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే బ్రతికేదేమో? కానీ వారు అలా చేయలేదు. ఆమె చనిపోతే కేసు తమ మెడకు చుట్టుకుంటుందని భయపడ్డారు.

ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావ్? కారణం ఎవరూ అంటూ ప్రశ్నిస్తూ ఆమె చనిపోతుంటే వీడియో తీసారు. శిఖా కొన్ని పేర్లు చెప్పింది. ఇపుడు ఆ వీడియో ముంబై పోలీసుల‌కు చేరింది. తాజాగా ఆడియో బయటకు రిలీజైంది. ఈ వీడియో చూస్తే ఆమె స్నేహితులకు మానవత్వం లేదని, కనీసం ఆమెను బ్రతికించుకోవాలనే ఆలోచన కూడా లేదని స్పష్టమవుతోంది.

నీవు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరంటూ ఆమెను వారంతా కొన్ని ప్రశ్నలు అడిగారు. హౌస్ ఓనర్ ఆమె చెప్పే విషయాలు సెల్ ఫోన్లో రికార్డు చేసారు. అయితే ఎవరూ కూడా ఆమెను హాస్పటల్ కు తీసుకుపోవడానికి సాహసం చేయలేదు. పోలీసుల నుండి తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా అన్ని ప్రశ్నలు అడిగి రికార్డు చేసిన తర్వాత...అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను ఆసుపత్రికి తీసకెళ్లే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే శిఖా జోషి మరణించింది. తన ఆత్మహత్యకు కారణం డాక్టర్ విజయ్ శర్మ తో మరికొందరు వ్యక్తులు కారణంగా అంటూ శిఖా జోషి కొన్ని పేర్లు చెప్పింది. ఈ వీడియో ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X