»   » నటి శిఖా జోషి ఆత్మహత్య...డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందట!

నటి శిఖా జోషి ఆత్మహత్య...డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇటీవ‌ల బాలీవ‌డ్ న‌టి శిఖా జోషి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు లేక పోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే తాజాగా కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Shikha Joshi

ఆమె ఆత్మహత్య చేసుకున్న స‌మ‌యంలో రూమ్‌కు వ‌చ్చిన ఆమె స‌హ‌చ‌రులు శిఖాను పిలిచారు. స్పంద‌న లేక‌పోవ‌డంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్క‌డ క‌త్తితో గొంతుకోసుకున్న శిఖా ర‌క్త‌పు మ‌డుగులో పడి ఉండ‌టంతో అంతా అవాక్క‌య్యారు. అప్ప‌టికీ శిఖా ప్రాణాల‌తో ఉంది. వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి తీసుకుపోయి ఉంటే బ్ర‌తికి ఉండేదేమో! ఆమె స్నేహితులు అలా చేయ‌లేదు. దీనికి కార‌ణం ఎవ‌ర‌ని కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. శిఖా కొన్ని పేర్లు చెప్పింది. అదంతా వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో ముంబై పోలీసుల‌కు చిక్కింది. పోలీసులు వీడియోలో శిఖ చెప్పిన పేర్ల‌పై ఆరా తీస్తున్న‌ట్లు తెలిసింది.

శిఖా జోషి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమెతో మాట్లాడిన వారిలో ఒకరైన పుష్పా పరామర్ మాట్లాడుతూ... చనిపోయే ముందు తన చావుకు కారణం డాక్టర్ విజయ్ శర్మ అని చెప్పిందని తెలిపారు. అయితే డాక్టర్ చెప్పిన విషయాలు మరోలా ఉన్నాయి.

కాస్మొటిక్ సర్జన్ డా.విజయ్ శర్మ హరాస్మెంట్ చేయడం వల్లనే శిఖా జోషి ఆత్మహత్య చేసుకుందని పుష్ప పరామర్ చెప్పుకొచ్చారు. శిఖా జోషి ఆత్మహత్య తర్వాత కనబడకుండా పోయిన డాక్టర్...ఇపుడు పోలీసుల ముందు హాజరయ్యాడు. శిఖా జోషి తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేదని చెప్పుకొచ్చాడు. డబ్బులు ఇవ్వకుంటే చనిపోతానని బెదిరించేదని తెలిపారు. పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

English summary
Shikha Joshi's suicide case is getting murkier with every passing day. Initially, it appeared that the actress committed suicide due to lack of work and frustration but now various new aspects are being unveiled.
Please Wait while comments are loading...