వీరాభిమానం: హృతిక్ రోషన్ కోసం కోకాకోలా కంపెనీపై కేసు

By Bojja Kumar

హైదరాబాద్‌: అభిమానుల్లో వీరాభిమానుల తీరు వేరయా అనడానికి తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. బాలీవుడ్ స్టార్ హృతిక్‌ రోషన్‌ అభిమాని ఒకరు ఏకంగా కోకా కోలా కంపెనీపై కోర్టు కెక్కారు. ఎందుకంటే తన అభిమాన హీరోను కలవడానికే. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.

పదేహేనేళ్ల క్రితం హృతిక్ రోషన్ కోక-కోలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అప్పట్లో ఓ కోక్‌ బాటిల్‌ కొంటే హృతిక్‌ని కలిసే అవకాశముందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం చండీగఢ్‌కి చెందిన హృతిక్‌ వీరాభిమాని శిఖా మోంగాకి సంస్థ నుంచి రూ. 5 లక్షల నగదు బహుమతి వచ్చింది. అయితే తనకి డబ్బు వద్దని హృతిక్‌ని కలవాలని ఉందని ఆమె సంస్థ యాజమాన్యాన్ని కోరింది. వారు మాట ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటివరకు కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నో ఉత్తరాలు రాసింది.

Shikha Monga sues Coca-Cola for Hrithik Roshan's no-show date

కోకా కోలా కంపెనీ నుండి సరైన స్పందన లేక పోవడంతో ఆమె కంపెనీపై కేసు పెట్టింది. సంస్థ తీరు తన పరువుకు భంగం కలిగించింది అంటూ రెండున్నర కోట్లకు నష్టపరిహారం డిమాండ్‌ చేసింది. తాను హృతిక్‌ని కలిసే అవకాశం కోసం ఎంత కష్టపడిందీ తన స్నేహితులకు, బంధువులకు తెలిసిందని, వారంతా తనను తరచూ ఈ విషయం అడుగుతున్నారని... కోకా కోల సంస్థ నుండి ఎలాంటి సమాధానం రాక పోవడంతో తన పరువు పోయినట్లయిందని ఆమె తన పిటీషన్లో పేర్కొన్నారు.

శిఖా మోంగా పిటీషన్ స్వీకరించిన చండీగర్ కోర్టు కోకా కోలా కంపెనీకి నోటీసులు పంపించింది. మరి ఈ కేసు ఎంత వరకు వెలుతుంది? కోకా కోలా సంస్థ ఆమె అడిగినంత నష్ట పరిహారం చెల్లిస్తుందా? లేదా హృతిక్ రోషన్ ను ఒప్పించి ఆమె కలిసే అవకాశం కల్పిస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X