బ్రిటన్ పార్లమెంట్ లో శిల్పాశెట్టి రిసెప్షన్
ఎన్నారై పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పాశెట్టి లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో రిసెప్షన్ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆమె అక్కడి వారితో మాట్లాడింది. 2007లో బిగ్‌బ్రదర్ షోలో విజేతగా నిలిచిన ఆమెకు అక్కడ చాలా మంది ప్యాన్స్ ఉన్నారు. అంతేగాక ఆమె లండన్ లో సెంట్లు, యోగా సీడీ, రెస్టారెంట్ల వంటి అనేక వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది. ఇపుడు ఏకంగా తన రిసెప్షన్‌కు హౌస్ ఆఫ్ కామన్స్‌నే ఎంచుకుని అందరి దృష్టిలో మరో సారి పడింది. ఇక ఈ రిసెప్షన్ కు చాలా మంది ప్రముఖులు హాజరుకానుండటంతో ఆతిథ్య వేడుకలకు భారీస్థాయిలో ఖర్చు చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











