సాధారణంగా హీరోయిన్స్ ధర్టీ ఫ్లస్ అయ్యేసరికి ఆంటీలుగా మారిపోతారు. వదిన, అక్క, అత్త పాత్రలకు వెళ్ళిపోతారు. కానీ శిల్పాశెట్టి మాత్రం వయస్సుని జయించానంటోంది. రెగ్యులర్ గా యోగా చేసే ఆమె ఇప్పటికీ జీరో సైజ్ లో ఉంటూ తన జూనియర్ హీరోయిన్స్ కి షాక్ ఇస్తోంది. వారంతా మొదట తిట్టుకున్నా ఆ తర్వాత ఆమె సలహాల కోసం వెంటబడతున్నారు. తాజాగా ఆమె జూన్ ఎనిమిదిన 35 క్రాస్ చేస్తోంది. అయినా వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్స్ వారు ఆమె స్టిల్స్ కోసం వెంటబడుతున్నారు. జూన్ మ్యాగజైన్ లో ఆమె స్టిల్స్ వచ్చింది. ఆ మ్యాగజైన్స్ లో కవర్ పేజిలో ఫోటో వస్తే తాము బిజీ అవుతామని జెనీలియా వంటి హీరోయిన్స్ సైతం రెడీ అవుతున్నారు. ఏదైమైనా అప్పట్లో రేఖ ఇప్పుడు శిల్పా శిల్పాల్లా అలా అదే అందాలతో ఉండిపోవటం ఆశ్చర్యమేనంటున్నారు బాలీవుడ్ జనం.