విడాకులు తీసుకునే వరకూ హద్దులు దాటవద్దు అని తన కాబోయే భర్త రాజ్ కుంద్రాకు చెప్పే ముందుకు వెళ్ళానని శిల్పాశెట్టి హలో పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. అలాగే విడాకులు వచ్చేదాకా ఆగామి ఆ తర్వాతే దగ్గరైనట్లు ఆమె వివరించారు. పెళ్ళయిన మగాడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందంటూ ఆమెపై వస్తున్న విమర్శలు కొట్టి పారేశారు. తాను ఎవరి కొంపలు కూల్చటం లేదని, అటువంటి దాన్ని కాదని తీవ్రంగా స్పందిచింది. డబ్బు కోసం ఆశపడి ఆమె రాజ్ కుంద్రాని ఆకట్టుకుని అతని కాపురాన్ని కూల్చిందంటూ ఈ మధ్య ముంబయి పత్రికల్లో వార్తలు వచ్చాయి.